నేడు ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో ఈ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్​ఎల్ నరసింహన్ ప్రసంగించనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు సభ ప్రారంభంకానుంది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నాలతో సహా ఇతర హామీల అమలు, ప్రాధాన్యత అంశాలపై గవర్నర్ తన ప్రసంగంలో తెలపనున్నారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, అవినీతి రహిత పాలన, టెండర్ల ప్రక్రియకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలను గవర్నర్ సభలో ప్రస్తావించనున్నారు. అక్టోబర్ 15 నుంచి […]

నేడు ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం

Edited By:

Updated on: Jun 14, 2019 | 11:18 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో ఈ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్​ఎల్ నరసింహన్ ప్రసంగించనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు సభ ప్రారంభంకానుంది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నాలతో సహా ఇతర హామీల అమలు, ప్రాధాన్యత అంశాలపై గవర్నర్ తన ప్రసంగంలో తెలపనున్నారు.

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, అవినీతి రహిత పాలన, టెండర్ల ప్రక్రియకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలను గవర్నర్ సభలో ప్రస్తావించనున్నారు. అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని మంత్రి మండలి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రాబోయే 4 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలతోపాటు, ఉద్యోగుల సంక్షేమం, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, పౌరసరఫరాల్లో తీసుకురాబోతున్న మార్పులను సభ్యులకు వివరిస్తారు. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించడంలో జగన్ ప్రభుత్వం అనుసరించబోయే విధానాలు, చేపట్టే పాలనా సంస్కరణలను గవర్నర్ నరసింహన్ సభ్యులకు తెలియజేయనున్నారు.