తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట మండలం, కడిపికొండ గ్రామస్తులు 14 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురి ఆచూకీ తెలిసింది. మిగిలిన 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం గల్లంతైనవారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై తెలంగాణ, ఏపీ సీఎంలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం జగన్ మృతులు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా.. సీఎం కేసీఆర్ 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.
ఆచూకీ తెలిసిన వారి వివరాలు:-
1) బసికె దశరథం s/o కొమురయ్య, 54 సం.
2) బసికె వెంకటస్వామి s/o రాజయ్య, 58 సం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి
3) దర్శనాల సురేష్ s/o లింగయ్య, 24 సం.
4) గొర్రె ప్రభాకర్ s/o వెంకటస్వామి, 54 సం., రైల్వే ఉద్యోగి
5) ఆరేపల్లి యాదగిరి s/o కాజయ్య, 35 సం.
ఆచూకీ తెలియని వారి వివరాలు:-
1) సివి వెంకటస్వామి s/o రామస్వామి, 62 సం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి
2) బసికె రాజేంద్రప్రసాద్ s/o వెంకటస్వామి, 50 సం.
3) కొండూరు రాజకుమార్ s/o గోవర్ధన్, 40 సం.
4) బసికె ధర్మరాజు s/o కొమురయ్య, 42 సం
5) గడ్డమీది సునీల్ , 40 సం.
6) కొమ్ముల రవి , 43 సం
7) బసికె రాజేందర్ ,58 సం
8) బసికె అవినాష్,s/o తిరుపతి, 17 సం
9 ) .గొర్రె రాజేంద్రప్రసాద్ s/o రామస్వామి, 55 సం.
గల్లంతైన హైదరాబాద్ వాసులు:-
1.సాయి కుమార్
2.రాజేష్
3.అబ్దుల్ సలీమ్
4.మహేశ్వర్ రెడ్డి
మిగిలిన ప్రాంతాల వారి వివరాలు:-
1.జెమిని రామారావు(రాజమండ్రి)
2. మురళీ(విశాఖపట్నం)
3.సన్నీ(విశాఖ)
4.కేవీఆర్(విశాఖ)
5. గుత్తుల ప్రకాశ్, కిన్నెపల్లి వాసుబాబు
విష్ణుకుమార్, వి.రఘురామ్( మారుతీ ట్రావెల్స్ ద్వారా)
6.జగన్నాథ్ (రాజోలు)
7.రమణ (విశాఖ)
కాగా ఇప్పటి వరకు 7 మృతదేహాలు లభించాయి. 20 మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులకు ప్రధమ చికిత్స అందించి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.