సాయంత్రం లోపు పూర్తి చేస్తాం : మంత్రి అవంతి

| Edited By:

Sep 16, 2019 | 10:26 AM

విహారయాత్ర విషాదయాత్రగా ముగిసిన గోదావరి బోటు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనలో గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగినప్పటినుండి రాత్రి పొందుపోయే వరకు ఎన్డీఆర్ఎఫ్ దళాలతో పాటు గజ ఈతగాళ్లు సైతం గోదావరిలో గల్లంతైన వారికోసం గాలించారు. రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది. ఈ ఉదయం మళ్లీ సహాయక చర్యలు ప్రారంభించారు. మరోవైపు ఏపీ పర్యాటక శాఖా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గాలింపు చర్యలు ముమ్మరం […]

సాయంత్రం లోపు పూర్తి చేస్తాం : మంత్రి అవంతి
Follow us on

విహారయాత్ర విషాదయాత్రగా ముగిసిన గోదావరి బోటు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనలో గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగినప్పటినుండి రాత్రి పొందుపోయే వరకు ఎన్డీఆర్ఎఫ్ దళాలతో పాటు గజ ఈతగాళ్లు సైతం గోదావరిలో గల్లంతైన వారికోసం గాలించారు. రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది. ఈ ఉదయం మళ్లీ సహాయక చర్యలు ప్రారంభించారు.

మరోవైపు ఏపీ పర్యాటక శాఖా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఇవాళ సాయంత్రం లోపు సహాయక చర్యలు పూర్తి చేస్తామన్నారు. ఇదిలాఉంటే ధవళేశ్వరం వద్ద కూడా గోదావరిలో గల్లంతైన వారి కోసం గాలింపును ముమ్మర చేశారు. బ్యారేజీకి ఉన్న 175 గేట్లను మూసివేశారు. ఈ విధంగా చేయడం వల్ల గాలింపు సులభమవుతుందని అధికారుల పేర్కొన్నారు.