‘గేర్ వెయ్యలేక.. ఎక్సలేటర్ తొక్కలేక లోకేష్ అవస్థలు’

జగన్ సర్కారు తెచ్చిన రైతులకు ఉచిత కరెంట్ నగదు బదిలీకి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ చేస్తున్న ఆరోపణలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎదురుదాడికి దిగారు.

గేర్ వెయ్యలేక.. ఎక్సలేటర్ తొక్కలేక లోకేష్ అవస్థలు

Updated on: Sep 07, 2020 | 6:26 PM

జగన్ సర్కారు తెచ్చిన రైతులకు ఉచిత కరెంట్ నగదు బదిలీకి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ చేస్తున్న ఆరోపణలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎదురుదాడికి దిగారు. రైతులకు నిధుల బదిలీ పథకం రైతాంగానికి ఉరివేసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత లోకేష్‌లా మాట్లాడితే ఎలా!. అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు మాటలు మతి భ్రమించిదనుకునేలా ఉన్నాయన్నారు. చంద్రబాబు కొడుకేమో గేరు వెయ్యలేక పోతున్నారు. ఎక్సలేటర్ తొక్కలేకపోతున్నారు. చంద్రబాబు దగ్గర బిర్యానీ పొట్లాలకు ప్రెస్‌మీట్లు పెట్టే నాయకులున్నారు అంటూ వంశీ విమర్శలు గుప్పించారు. సోమవారం విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించిన వంశీ.. 30 ఏళ్ళ పాటు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పుకొచ్చారు. నాడు ఎన్టీఆర్ నాడు 50 రూపాయలకు హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చి కుటుంబాలు పైకి రావడానికి కారణమైతే.. తర్వాత వైఎస్సార్ ఇచ్చిన ఉచిత విద్యుత్ వల్లనే వ్యవసాయం బతికిందన్నారు వంశీ.

Loading...
Unable to load recommendations.
Follow Us