కుమారుడితో గొడవ.. కోడెల ఆత్మహత్యకు కారణాలివేనా..!

| Edited By:

Sep 16, 2019 | 1:12 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న ఆయనను.. వెంటనే బసవతారకం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఓటమి తరువాత కోడెల, ఆయన కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు వినిపించాయి. కే టాక్స్ పేరుతో ఆయన కుటుంబం భారీగా వసూళ్లు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ […]

కుమారుడితో గొడవ.. కోడెల ఆత్మహత్యకు కారణాలివేనా..!
Follow us on

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న ఆయనను.. వెంటనే బసవతారకం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో ఓటమి తరువాత కోడెల, ఆయన కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు వినిపించాయి. కే టాక్స్ పేరుతో ఆయన కుటుంబం భారీగా వసూళ్లు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కోడెల, ఆయన కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరామకృష్ణలపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాకుండా అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన సమయంలో ఫర్నీచర్‌ను సైతం తన నివాసానికి తరలించినట్లు ఆధారాలు లభించాయి. ఆ తరువాత ఫర్నీచర్‌ను అసెంబ్లీ సిబ్బంది స్వాధీనం చేసుకోగా.. అరెస్ట్‌ల నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇక వరుసగా వివాదాలు వస్తున్న సమయంలో.. ఆరోపణలపై కుమారుడితో మాట్లాడుతున్న సమయంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. అంతేకాదు గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్లు సన్నిహితులు చెబున్నారు. ఇలా ఓ వైపు కేసులు, మరోవైపు ఇంట్లో గొడవలు అవమానాలు తట్టుకోలేక పోయిన ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.