ఏపీ అసెంబ్లీలో రాజమౌళి, బోయపాటి పేర్లు..మ్యాటర్ ఏంటంటే..?

|

Dec 17, 2019 | 5:37 PM

రాజధాని అమరావతిపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ధర్మాన ప్రసాదరావు క్యాపిటల్‌ విషయంపై..గతంలో అధికారంలో ఉన్న టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొత్త రాజధానిపై సరైన చర్చజరగలేదని, అందుకే ఆరేళ్ల తర్వాత కూడా ఏపీకి క్యాపిటల్ సిటీ లేకుండా పోయిందని  ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో ఏ ఆఫీసు ఎక్కడో ఉందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిందని, విఙ్ఞత లేకుండా నిర్ణయం తీసుకున్నారని..అసలు శివరామకృష్ణన్ నివేదికను ఎందుకు అమలు చెయ్యలేదని ధర్మాన ప్రశ్నించారు. కేవలం ఒక […]

ఏపీ అసెంబ్లీలో రాజమౌళి, బోయపాటి పేర్లు..మ్యాటర్ ఏంటంటే..?
Follow us on

రాజధాని అమరావతిపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ధర్మాన ప్రసాదరావు క్యాపిటల్‌ విషయంపై..గతంలో అధికారంలో ఉన్న టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొత్త రాజధానిపై సరైన చర్చజరగలేదని, అందుకే ఆరేళ్ల తర్వాత కూడా ఏపీకి క్యాపిటల్ సిటీ లేకుండా పోయిందని  ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో ఏ ఆఫీసు ఎక్కడో ఉందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిందని, విఙ్ఞత లేకుండా నిర్ణయం తీసుకున్నారని..అసలు శివరామకృష్ణన్ నివేదికను ఎందుకు అమలు చెయ్యలేదని ధర్మాన ప్రశ్నించారు.

కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ది చేయడం వల్లే,  ప్రస్తుతం ఏపీకి ఇన్ని కష్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేసిందన్న ధర్మాన..కేంద్రం గత ఐదేళ్లలో 23 ఇన్సిస్టూషన్స్ ఏపీకి కేటాయిస్తే, అందులో ఒక్కటి కూడా వెనకబడ్డ శ్రీకాకుళంకు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. జీవన ప్రమాణాలు తక్కువ ఉన్న జిల్లాలలో అత్యంత అడుగున ఉన్న శ్రీకాకుళంకు..చంద్రబాబు చేసిన అన్యాయం ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో కిడ్నీ వ్యాధులొచ్చి చనిపోతుంటే..పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శ్రీకాకుళం నుంచి 2 లక్షల మంది వలస వెళ్లి బ్రతకాల్సి వచ్చిందని, రాజధాని విషయంలో బయటకి ఒకటి చెప్పి, టీడీపీ లోపల మరోకటి చేశారన్నది అందరి తెలిసిన విషయమే అని ధర్శాన పేర్కొన్నారు.

కాగా 15 ప్రభుత్వాలు మారితేగాని రాజధాని నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి లేదని, స్విస్ చాలెంజ్ వద్దని గత ప్రభుత్వం వినలేదని ధర్మాన పేర్కొన్నారు. సినిమా డైరెక్టర్లు రాజమౌళి, బోయపాటి శ్రీనులు రాజధాని నిర్మాణానికి సలహాదార్లా అంటూ ధర్మాన..చంద్రబాబను ఎద్దేవా చేశారు.