ఇక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి: జగన్ ఆదేశాలు

ప్రజలు బాధతో పోలీస్ స్టేషన్‌కు వస్తారని.. వారు వచ్చినప్పుడు ఎందుకు వచ్చామా..? అని బాధపడకూడదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. విశాఖ కలెక్టర్ వినయ్‌తో మాట్లాడిన జగన్.. అన్ని పోలీస్ స్టేషన్‌లో రిసెప్షనిస్టులు ఉండాలని సూచించారు. స్టేషన్‌కు ప్రజలు వచ్చినప్పుడు వారి ఫిర్యాదులను ఎలా స్వీకరిస్తున్నాం.. ఎలా పరిష్కరిస్తున్నామన్నది ముఖ్యమని పేర్కొన్నారు. చిరునవ్వుతో ప్రజలను స్వాగతించాలని.. ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఈ సందేశం పంపాలని సూచించారు. దీని గురించి ఇదివరకే  చెప్పానని.. ఇప్పుడు కూడా కొనసాగాలంటూ […]

ఇక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి: జగన్ ఆదేశాలు

Edited By:

Updated on: Jul 16, 2019 | 3:54 PM

ప్రజలు బాధతో పోలీస్ స్టేషన్‌కు వస్తారని.. వారు వచ్చినప్పుడు ఎందుకు వచ్చామా..? అని బాధపడకూడదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. విశాఖ కలెక్టర్ వినయ్‌తో మాట్లాడిన జగన్.. అన్ని పోలీస్ స్టేషన్‌లో రిసెప్షనిస్టులు ఉండాలని సూచించారు. స్టేషన్‌కు ప్రజలు వచ్చినప్పుడు వారి ఫిర్యాదులను ఎలా స్వీకరిస్తున్నాం.. ఎలా పరిష్కరిస్తున్నామన్నది ముఖ్యమని పేర్కొన్నారు. చిరునవ్వుతో ప్రజలను స్వాగతించాలని.. ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఈ సందేశం పంపాలని సూచించారు. దీని గురించి ఇదివరకే  చెప్పానని.. ఇప్పుడు కూడా కొనసాగాలంటూ వెల్లడించారు. అలాగే పంచగ్రామాల సమస్యను తీర్చడానికి దృష్టిపెట్టాలని వినయ్‌కు ఆదేశాలు జారీ చేశారు జగన్. కాగా తన పరిపాలన పారదర్శకంగా ఉంటుందని చెప్తూ వస్తోన్న సీఎం.. ఆ మేరకు చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే.