CM YS Jagan: ఏపీలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్న సీఎం.. పాఠశాల స్థాయిలో సంస్కరణలు.. ఇప్పుడు ఉన్నత విద్యపై నజర్

|

Sep 13, 2021 | 6:23 PM

ఏపీలో సీఎం జగన్‌ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పటికే పాఠశాల స్థాయిలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రి ఉన్నతవిద్యపై

CM YS Jagan: ఏపీలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్న సీఎం.. పాఠశాల స్థాయిలో సంస్కరణలు.. ఇప్పుడు ఉన్నత విద్యపై నజర్
Cm Jagan
Follow us on

AP Education System – CM Review: ఏపీలో సీఎం జగన్‌ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పటికే పాఠశాల స్థాయిలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రి ఉన్నతవిద్యపై కూడా దృష్టిసారించారు. కాలేజీలు, పాలిటెక్నిక్‌, ఐటీఐలో విద్యార్థులకు స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌పై సమీక్ష నిర్వహించారు. కాలేజీలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలో నైపుణ్యాలు పెంచాలని ఆదేశించారు. టీచింగ్‌తో పాటు విద్యార్థుల్లో స్కిల్స్‌ డెవలప్‌మెంట్ ఎంతో అవసరమన్నారు. ప్రతిపార్లమెంట్‌ నియోజకవర్గంలో నైపుణ్యాల అభివృద్దికోసం ఒక కాలేజీని పెట్టబోతున్నట్లు తెలిపారు. విశాఖలో హై అండ్‌ స్కిల్‌ యూనివర్శిటీ, తిరుపతిలో స్కిల్‌ యూనివర్శిటీ పెడతామన్నారు. విశాఖలో ఆపనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

కోడింగ్, లాంగ్వేజెస్, రోబోటిక్స్, ఐఓటీ లాంటి అంశాల్లో పరిజ్ఞానాన్ని పెంచేలా నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో బోధన, శిక్షణ ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడం ద్వారా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కాన్సెప్ట్‌ను బలోపేతం చేస్తున్నామన్నారు. ఇక పార్లమెంట్‌ నియోజవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలకు వర్క్‌ప్రమ్‌ హోంకు మధ్య సినర్జీ ఏర్పడుతుందన్నారు. దీనివల్ల యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కోర్సుల రూపకల్పన విప్లవాత్మకంగా ఉండాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌కోసం కొత్తగా నిర్మించే కాలేజీల్లో తరగది నిర్మాణంలో వినూత్నపద్దతులను పాటించాలని సీఎం ఆదేశించారు. ఐటీఐలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి ఐటీఐకాలేజీకి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్చన్‌ వంటి సంస్థలను భాగస్వాములను చేసే ఆలోచన చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఐటీఐ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతిలో డ్రాప్‌ అవుట్‌ అయిన యువకుల నైపుణ్యాలను పెంపొందించేందుకు దృష్టిపెట్టాలన్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమలకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ పొందినవారి డేటాను పంపించాలన్నారు. 75 శాతం ఉద్యోగాలు కేవలం స్థానికులకు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అంతేకాదు ఇంగ్లీషులో మంచి పరిజ్ఞానాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Read also: Prajavani: కలెక్టర్‌ ముందుకి పిస్టల్‌, కత్తి, కారంపొడితో ఆర్జీదారు..! కృష్ణాజిల్లా ప్రజావాణిలో కలకలం