ఏపీలో వన్‌సైడ్ విక్టరీ సాధించిన జగన్..ప్రజారంజక పాలన చేస్తూ ముందుకుసాగుతున్నారు. ఇప్పటివరకు అయితే జగన్ పాలనపై పాజిటీవ్ బజ్ మాత్రమే ఉంది. కాకపోతే ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై ఒంటికాలిపై విరుచుకుపడుతున్నారు. గవర్నమెంట్ టార్గెట్‌గా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఏపీలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్యహత్యలపై..ఇటీవల పవన్ చేపట్టిన లాంగ్ మార్చ్ బిగ్ సక్సెస్ అయ్యింది. జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక అంతో, ఇంతో ప్రభుత్వానికి నెగటీవ్‌గా అనిపించిన ఇష్యూ ఏదైనా ఉందా..? అంటే అది ఇసుక మాత్రమే. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. త్వరలోనే ఏపీలో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉండటంతో.. జగన్ విపక్షాలకు చెక్ పెట్టేందుకు గేమ్ ప్లాన్ సిద్దం చేశారని తెలుస్తోంది.
ఇసుక కొరతను తీర్చేందుకు త్వరలోనే ఇసుక వారోత్సవాలు చేపట్టబోతుంది ఏపీ ప్రభుత్వం. ఇది పక్కన బెడితే..ఇటీవలే మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును ఇంటికివెళ్లి కలిశారు సీఎం జగన్. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం. దీంట్లో పొలిటికల్ యాంగిల్ కూడా ఉందనేది రాజకీయ నిపుణులు నుంచి వినిపిస్తోన్న మాట. గత ఎన్నికల్లో కమ్యూనిష్టు పార్టీలతో కలిసి జనసేన అధినేత ఎన్నికల బరిలోకి దిగారు. అయినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ప్రస్తుతం కమ్యూనిష్టులకు పవన్ దూరం అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన లాంగ్ మార్చ్‌లో పాల్గొనాల్సిందిగా పవన్..ఎర్రజెండా పార్టీలను కోరినప్పటికి..వారు ఆ కార్యక్రమానికి బీజేపీని ఆహ్వానించారనే కారణంతో గైర్హాజరయ్యారు. అంతేకాదు పవన్ బీజేపీకి దగ్గరవుతున్నారే ఆలోచన సీనియర్ కమ్యూనిస్ట్ నేతల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే కమ్యూనిష్టు పార్టీలను తనవైపు తిప్పుకునేందుకు సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ సిద్దం చేశారని సమాచారం.
ప్రభుత్వ డ్యామేజీకి యత్నిస్తున్న పవన్‌కి.. కమ్యూనిష్టులను దూరం చెయ్యడం ద్వారా చెక్ పెట్టాలని సీఎం సమాలోచనలు చేస్తున్నారట. అంతేకాదు అలా చెయ్యడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిష్టుల సపోర్ట్ లభించి.. వైసీపీకి ఎంతో కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉండనే ఉంది. ఇక విపక్షాలను అన్నీ కలిపి ప్రభుత్వంపై ఎదురుదాడి చెయ్యాలన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆలోచనలకు కూాాడా ఈ ప్లాన్ చెక్ పెడుతుందని సీఎం భావిస్తున్నట్లు సమాచారం.