Chandrababu Naidu: అప్పుడు జగన్.. ఇప్పుడు బాబు.. సేమ్ సీన్..!

విశాఖపట్టణంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బాబు పర్యటనను వ్యతిరేకిస్తూ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన కాన్వాయ్‌‌కు అడ్డంగా పడుకున్నారు.

Chandrababu Naidu: అప్పుడు జగన్.. ఇప్పుడు బాబు.. సేమ్ సీన్..!

Edited By:

Updated on: Feb 27, 2020 | 4:25 PM

విశాఖపట్టణంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బాబు పర్యటనను వ్యతిరేకిస్తూ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన కాన్వాయ్‌‌కు అడ్డంగా పడుకున్నారు. దీంతో మూడు గంటలైనా చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదలకపోగా.. కారులో నుంచి దిగిన బాబు రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా కొందరు కార్యకర్తలు కాన్వాయ్‌లోని వాహనాలు ఎక్కి మరీ నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రజా సంఘాల అధ్యక్షుడు జేటీ రామారావు, పెట్రోల్ బాటిల్‌ తీసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు. ఈ క్రమంలో అడ్డుపడ్డ పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు దాదాపు ఇలాంటి సంఘటన ఆయనకు ఎదురైంది. అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశంపార్టీ జగన్‌ను ఎయిర్‌పోర్టులో చాలా సేపు అడ్డుకుంది. అప్పుడు విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబులు పోలీసులతో వాగ్వాదం చేస్తే,.. ఇప్పుడు టీడీపీ నేత అచ్చెన్నాయుడు , మాజీ మంత్రులు పోలీసులతో వాదులాటకు దిగారు.

Read This Story Also: చంద్రబాబు వెనక్కి వెళ్లకుంటే.. ఆత్మహత్య చేసుకుంటా