టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పర్యటనకు ఉభయ గోదావరి జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు హాజరుకాలేదు. అలాగే జలవనరుల శాఖ కార్యదర్శి కూడా గైర్హాజరయ్యారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కలెక్టర్లు ఈ పర్యటనకు హాజరు కాలేదని తెలుస్తోంది.