”నువ్వేమైనా నార్త్ కొరియా అధ్యక్షుడి కిమ్ జాంగ్ ఉన్‌వా.. ప్రజాస్వామ్యంలో శాసించే అధికారం లేదు” అంబటి ఫైర్..

AP Local Body Elections: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు....

నువ్వేమైనా నార్త్ కొరియా అధ్యక్షుడి కిమ్ జాంగ్ ఉన్‌వా.. ప్రజాస్వామ్యంలో శాసించే అధికారం లేదు అంబటి ఫైర్..

Updated on: Feb 06, 2021 | 6:02 PM

AP Local Body Elections: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ విచిత్రంగా ప్రవర్తిస్తోందని.. ఘర్షణ వాతావరణంలో ఎన్నికల జరపాలని చూస్తోందని అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. అలాగే పంచాయితీ ఎన్నికల్లో వివక్షలకు లబ్ది చేకుర్చాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ మేనిఫెస్టోపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నించారు.

సెక్యూరిటీ సర్టిఫికేట్ లేకుండానే ఈ యాప్ తేవడంతో పాటు చంద్రబాబును రక్షించే ప్రయత్నం చేస్తున్నారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ ఆంక్షలను తప్పుబట్టారు ఎమ్మెల్యే అంబటిరాంబాబు. రాజ్యాంగం కల్పించిన అధికారాలను నిమ్మగడ్డ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. పక్షపాతంతో వ్యవహరిస్తే రాజ్యాంగ రక్షణ ఉండదన్నారు అంబటి. కాగా, పంచాయితీ ఎన్నికల్లో ఎప్పటి నుంచో ఏకగ్రీవాలు జరుగుతున్నాయన్న అంబటి.. చట్ట విరుద్దంగా పనిచేసే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read: అల్లు అర్జున్ కార్వాన్‏ను ఢీకొట్టిన లారీ.. ఖమ్మం సమీపంలో రోడ్డు ప్రమాదం..