అంతర్వేది రథం కేసు..జీవో జారీ చేసిన ఏపీ సర్కార్?

|

Sep 11, 2020 | 1:17 PM

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మూడు రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంపై ఏపీ సర్కార్ సీరియస్‌గా దృష్టి సారించింది. ప్రమాద సంఘటనపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

అంతర్వేది రథం కేసు..జీవో జారీ చేసిన ఏపీ సర్కార్?
Follow us on

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మూడు రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంపై ఏపీ సర్కార్ సీరియస్‌గా దృష్టి సారించింది. ప్రమాద సంఘటనపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. లక్ష్మీనరసింహస్వామి దివ్య రథం దగ్ధమైన కేసును సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని.. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కేంద్ర హోంశాఖకు.. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ డీజీపీ కార్యాలయం లేఖ కూడా పంపింది.

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మూడు రోజుల క్రితం అగ్నిప్రమాదం జరిగిన సంగతి విధితమే..ఈ ఘటనలో వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న అగ్నికుల క్షత్రియుడు, అలయ నిర్మాత కోపనాతి కృష్ణమ్మ నిర్మించిన రథం కాలి బూడిదైంది. సుమారు 40 అడుగుల ఎత్తు ఉన్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అలాంటి రథం దగ్ధం కావడంతో రాష్ట్రంలో రాజకీయంగానూ దుమారం రేపుతోంది.

అయితే, ప్రమాదానికి గల కారణాలపై పలువురు అనేక అనుమానాలు లెవనేత్తుతున్నారు. మరోవైపు ఇదే అంశంపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర దుమారమే నడుస్తోంది. తేనెతుట్టెను తీసే సమయంలో మంటలు పెట్టడంతో అది కాలిపోయిందని ఓ వాదన ఉంది. ఉత్సవ రథం కాలి బూడిదైన ఘటనను బీజేపీ, జనసేన, టీడీపీతో పాటు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనపై ఇప్పటికే కొందరు అధికారుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంది.