పేదలకు శుభవార్త.. ఆగష్టు 15న ఇళ్లపట్టాలు పంపిణీ..!

|

Jul 07, 2020 | 9:44 AM

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. మొదట సంక్రాంతి కానుకగా పేదలకు ఇవ్వాలనుకున్న జగన్ సర్కార్.. కొన్ని అనివార్య కారణాల వల్ల అది కాస్తా అంబేద్కర్ జయంతి రోజుకు వాయిదా పడింది. ఆ తర్వాత స్థానిక ఎన్నికలు, కరోనా వైరస్, లాక్ డౌన్.. ఇలా ఒక్కొక్కటిగా అడ్డంకులు రావడంతో.. వైఎస్సార్ జయంతి జూలై 8న పేదలకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. […]

పేదలకు శుభవార్త.. ఆగష్టు 15న ఇళ్లపట్టాలు పంపిణీ..!
Follow us on

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. మొదట సంక్రాంతి కానుకగా పేదలకు ఇవ్వాలనుకున్న జగన్ సర్కార్.. కొన్ని అనివార్య కారణాల వల్ల అది కాస్తా అంబేద్కర్ జయంతి రోజుకు వాయిదా పడింది. ఆ తర్వాత స్థానిక ఎన్నికలు, కరోనా వైరస్, లాక్ డౌన్.. ఇలా ఒక్కొక్కటిగా అడ్డంకులు రావడంతో.. వైఎస్సార్ జయంతి జూలై 8న పేదలకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మళ్లీ వాయిదా పడింది. తాజాగా దీనిపై రాష్ట్ర పురపాలికశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.

జూలై 8న రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించిందని.. అయితే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఆ రోజున ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయలేకపోతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. నిరుపేదలకు సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మహాయజ్ఞం చేస్తుంటే.. టీడీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు.

టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. న్యాయస్థానం నుంచి అనుమతులు తీసుకుని ఆగష్టు 15న ఎట్టి పరిస్థితులలోనూ పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పేదలందరికీ ఇళ్లు కట్టించాలని సీఎం జగన్ సంకల్పించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది అర్హులైన పేదలు ఉన్నారని గుర్తించామన్నారు. వారందరికీ ఇళ్ళస్థలాల కోసం 26,034 ఎకరాల్లో లేఅవుట్లు వేశామని.. జూలై 8న పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశామన్నారు. కానీ టీడీపీ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.