వచ్చే నెలలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అమరావతిలోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. జగన్ హయాంలో తొలి స్వాతంత్ర్య వేడుకలు విశాఖ నగరంలో జరుగుతాయనే వార్తలొచ్చాయి. అయితే.. ఏర్పాట్లు చేయడానికి తగిన సమయం లేకపోవడంతో అమరావతిలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసిన ప్రదేశంలోనే ఆగష్టు 15 వేడుకలు నిర్వహిస్తారట. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా షురూ అయినట్లు సమాచారం.