రైతు భరోసా విధి విధానాలు విడుదల.. అర్హులు వీరే

| Edited By: Pardhasaradhi Peri

Sep 20, 2019 | 10:20 AM

ఏపీ రైతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 15న నుంచి ఈ పథకం ప్రారంభం కానుండగా.. దానికి సంబంధించి విధివిధానాలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పథకం కింద ప్రధాని కిసాన్ పథకం నగదు రూ.6వేలతో కలిపి రూ.12వేలు రైతులకు అందించనున్నారు. ప్రతి రైతు కుటుంబానికి పథకాన్ని వర్తింపజేస్తూ విధివిధానాలు జారీ చేశారు. అలాగే ఎస్సీ, […]

రైతు భరోసా విధి విధానాలు విడుదల.. అర్హులు వీరే
Follow us on

ఏపీ రైతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 15న నుంచి ఈ పథకం ప్రారంభం కానుండగా.. దానికి సంబంధించి విధివిధానాలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పథకం కింద ప్రధాని కిసాన్ పథకం నగదు రూ.6వేలతో కలిపి రూ.12వేలు రైతులకు అందించనున్నారు. ప్రతి రైతు కుటుంబానికి పథకాన్ని వర్తింపజేస్తూ విధివిధానాలు జారీ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు ఈ పథకం వర్తించనుంది

రైతు భరోసా పథకానికి అర్హులు వీరే:

1. ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమకూ రైతు భరోసా పథకం వర్తింపు. అలాగే ఉద్యాన పంటలు కనీసం ఎకరం భూమి సాగులో ఉండాలని నిబంధన.
2.కూరగాయలు, పువ్వులు, పశువుల మేత కోసం కనీసం అర ఎకరం భూమి సాగు చేస్తుండాలి.
3. ఒకే యజమానికి ఒకరికి మించి కౌలుదారులుంటే వారిలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఒకరికి మించి కౌలుదారులుంటే ఎస్టీలకు ప్రాధాన్యం. ఆ తరువాత ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యం.
4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయం బట్టి పథకం వర్తింపు.

అర్హులు కాని వారు:
1. వ్యవస్థీకృత భూ యజమానులకు ఈ పథకం వర్తించదు.
2. మాజీ, ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు పథకం వర్తించదు.
3. జిల్లా పరిషత్ ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులకు రైతు భరోసా పథకం వర్తించదు.