ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్‌

కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్‌ వినిపించింది. వారానికి 5 రోజుల పనిదినాలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్‌

Edited By:

Updated on: Jun 26, 2020 | 10:46 PM

కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్‌ వినిపించింది. వారానికి 5 రోజుల పనిదినాలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది వరకు దీనిని పొడిగిస్తూ సీఎస్‌ నీలం సాహ్ని తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇది సచివాలయ ఉద్యోగులు, అన్ని శాఖల హెచ్‌ఓడీ కార్యాలయ ఉద్యోగులకు వర్తించనుంది. అయితే రాజధానిని హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చినప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు.. ఉద్యోగులకు వారానికి ఐదు రోజులు పని చేసే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని ఏడాది పాటు పొడగించారు. ఇక ఆ గడువు ఈ నెల 27తో ముగియనుండగా.. ఇటీవల దీనిపై సమీక్ష నిర్వహించిన జగన్, మరో ఏడాది దాన్ని పొడిగించారు.

ఈ సందర్భంగా ఏపీ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపైనా సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తున్నారు. ఉద్యోగులు మరింత బాగా పనిచేసేలా ఈ ఉత్తర్వులు ఇవ్వడం సంతోషం అని అన్నారు.