ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ఇంటర్‌లో గ్రేడింగ్ విధానం రద్దు.?

|

Dec 31, 2019 | 2:07 PM

విద్యారంగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇంటర్‌లో అమలవుతున్న గ్రేడింగ్ సిస్టం‌ను రద్దు చేయాలని సర్కార్ భావిస్తోందట. గ్రేడింగ్ విధానంతో వస్తోన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఇంటర్ తర్వాత పలు ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా ఇంటర్ మార్కులకే వెయిటేజ్ ఇస్తుండగా.. గ్రేడింగ్‌ విధానానికి పూర్తిగా స్వస్తి పలికి.. గతంలో మాదిరిగానే మార్కులు ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. ఈ మేరకు ఇంటర్ […]

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ఇంటర్‌లో గ్రేడింగ్ విధానం రద్దు.?
Follow us on

విద్యారంగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇంటర్‌లో అమలవుతున్న గ్రేడింగ్ సిస్టం‌ను రద్దు చేయాలని సర్కార్ భావిస్తోందట. గ్రేడింగ్ విధానంతో వస్తోన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఇంటర్ తర్వాత పలు ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా ఇంటర్ మార్కులకే వెయిటేజ్ ఇస్తుండగా.. గ్రేడింగ్‌ విధానానికి పూర్తిగా స్వస్తి పలికి.. గతంలో మాదిరిగానే మార్కులు ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. ఈ మేరకు ఇంటర్ విద్యా మండలి తుది కసరత్తులు మొదలుపెట్టగా.. మార్కులు ఎలా ఇవ్వాలనే దానిపై మాత్రం అధ్యయనం చేస్తున్నారని తెలుస్తోంది.

గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టక ముందు గతంలో మార్కులు ఇచ్చేవారు. సబ్జెక్టు వారీగా వచ్చిన మార్కులు.. మొత్తం కలిపి ఒక గ్రేడ్ ఇచ్చేవారు. అయితే ఈసారి మాత్రం గ్రేడ్ స్థానంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణులు ఇవ్వాలా.. లేదా మొత్తం మార్కులు ఇచ్చేసి ఉత్తీర్ణత సాధించారని మాత్రమే ఇవ్వాలా అనే దానిపై ఇంటర్ విద్యామండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. ఇందుకోసం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈల విధానాన్ని సైతం పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.