AP Backlog Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హతలుంటే నేరుగా జాబ్..

|

Mar 30, 2023 | 1:54 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)లో.. 54 ఎస్సీ/ ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును..

AP Backlog Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హతలుంటే నేరుగా జాబ్..
AP Backlog Jobs
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)లో.. 54 ఎస్సీ/ ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి 5వ తరగతి, 7వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆయా పోస్టులను బట్టి తెలుగు/ ఇంగ్లిష్‌ భాషలో చదవడం, రాయడం తెలిసి ఉండాలి. అలాగే సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీనాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 11, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. విద్యార్హతల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 2
  • జూనియర్ స్టెనో పోస్టులు: 1
  • టైపిస్ట్ పోస్టులు: 3
  • మాట్రాన్ కమ్ స్టోర్ కీపర్ పోస్టులు: 1
  • ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు: 8
  • మెసెంజర్ పోస్టులు: 2
  • ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • ల్యాబ్ అటెండర్ పోస్టులు: 1
  • వర్క్‌షాప్ అటెండర్ పోస్టులు: 1
  • స్కిల్డ్‌ వర్క్‌ మ్యాన్‌ పోస్టులు: 1
  • ఫిషర్ మ్యాన్ పోస్టులు: 1
  • శానిటరీ (పబ్లిక్ హెల్త్) మేస్త్రీ పోస్టులు: 1
  • వాచ్‌మ్యాన్ పోస్టులు: 9
  • వాటర్‌మ్యాన్ పోస్టులు: 1
  • స్వీపర్ పోస్టులు: 3
  • పబ్లిక్ హెల్త్ వర్కర్ పోస్టులు: 12
  • గ్యాంగ్ మజ్దూర్ పోస్టులు: 2
  • డ్రెయిన్ క్లీనర్ పోస్టులు: 1
  • కళాసి పోస్టులు: 1
  • హోల్ టైమ్ సర్వెంట్ పోస్టులు: 1
  • లస్కర్ పోస్టులు: 1

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.