కేసీఆర్ దారిలో వెళ్లండి.. జగన్ కు రామకృష్ణ సలహా

కేంద్ర విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.

కేసీఆర్ దారిలో వెళ్లండి.. జగన్ కు రామకృష్ణ సలహా

Updated on: Sep 17, 2020 | 6:00 PM

కేంద్ర విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కొత్త చట్టం వల్ల డిస్కంల నిర్వహణ, సబ్సిడీలు, ఈఆర్సీ వంటివి కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయి రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపితే రైతులకిచ్చే ఉచిత విద్యుత్తు కు మీటర్లు బిగించడం తప్పనిసరి అవుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును రాక్షస బిల్లుగా పరిగణించి, బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిందని ఆయన గుర్తుచేశారు. కానీ ఏపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలకు పచ్చజెండా ఊపి.. ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీ అంటున్నదని రామకృష్ణ విమర్శించారు. కేవలం రుణ పరిమితి పెంచుకొని, అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతి కోసం కేంద్ర నిర్ణయాలకు సై అనటం సరికాదని ఆయన ఎద్దేవా చేశారు.

Follow Us