చిన్న పరిశ్రమలకు చేయూత..రూ. 548 కోట్లు విడుదల

|

Jun 29, 2020 | 12:35 PM

చిన్న పరిశ్రమలకు ఏపీ సర్కార్ మరింత చేయూతనిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు రెండో విడత ఆర్థిక ప్రోత్సాహం విడుదల చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో

చిన్న పరిశ్రమలకు చేయూత..రూ. 548 కోట్లు విడుదల
Follow us on

చిన్న పరిశ్రమలకు ఏపీ సర్కార్ మరింత చేయూతనిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు రెండో విడత ఆర్థిక ప్రోత్సాహం విడుదల చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన సీఎం జగన్ ఎంఎస్ఎంఈలకు నిధులు విడుదల చేశారు.

రాష్ట్రంలో చిన్న పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రూ. 2 లక్షల నుండి 10 లక్షల రుణాలిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ఈ మేరకు ఎంఎస్ఎంఈలకు రూ. 548 కోట్ల నిధులు విడుదల చేశారు. ఈ రుణసాయానికి 6 నెలల మారటోరియం కల్పిస్తామన్నారు. 97,428 చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బకాయిలు విడుదల చేశారు. మరోవైపు ఏప్రిల్, మే, జూన్‌లో ఫిక్స్‌డ్ విద్యుత్ చార్జీలు మాఫీ చేసినట్లు జగన్ స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో పరిశ్రమలు నిలదొక్కుకోవాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వం పారిశ్రామిక రాయితీ బకాయిల కింద రూ. 800 కోట్లు విడుదల చేస్తే…వైసీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం 11 వందల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్పిన్నింగ్ మిల్స్‌కి కూడా ఇదే తరహాలో సాయం అందిస్తామని సీఎం పేర్కొన్నారు.