సెప్టెంబర్‌ 4న ఏపీ కేబినెట్ కీలక భేటీ

| Edited By: Srinu

Aug 30, 2019 | 7:47 PM

ఏపీ కేబినెట్ సెప్టెంబర్‌ 4న సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటిబ్లాక్‌లో ఉదయం 11.00 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్ని శాఖాల ఇంఛార్జిలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభం, అమలుపై కేబినెట్‌ సమీక్షించి ఆమోదించనుంది. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండర్ల ఆమోదం, రాజధానిలో చేపట్టే అభివృద్ధి పనులపైనా కూడా […]

సెప్టెంబర్‌ 4న ఏపీ కేబినెట్ కీలక భేటీ
Follow us on

ఏపీ కేబినెట్ సెప్టెంబర్‌ 4న సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటిబ్లాక్‌లో ఉదయం 11.00 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్ని శాఖాల ఇంఛార్జిలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభం, అమలుపై కేబినెట్‌ సమీక్షించి ఆమోదించనుంది. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండర్ల ఆమోదం, రాజధానిలో చేపట్టే అభివృద్ధి పనులపైనా కూడా చర్చించే అవకాశముంది.