ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో10వేలకు పైగా ఉద్యోగాలు

| Edited By:

Jul 16, 2020 | 4:23 PM

కరోనా సమయంలో నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో త్వరలో 10వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో10వేలకు పైగా ఉద్యోగాలు
Follow us on

కరోనా సమయంలో నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలో 10వేలకు పైగా ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. అందులో 9,712 ఉద్యోగాలు వైద్య ఆరోగ్య శాఖలోనే ఉండటం విశేషం. వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సులతో పాటు మిగిలిన వైద్య సిబ్బంది ఉండనున్నారు. దీనిపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. 9,712 పోస్టులలో 5,701 కొత్తవని, 4,011 ఖాళీగా ఉన్న స్థానాలని అన్నారు. కేబినెట్‌ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఇంకా ఏఏ పోస్టులు భర్తీ చేయనున్నారంటే..

1.ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ(గుంటూరు) హోం సైన్స్ విభాగంలో 2 ఫ్రొపెసర్‌, 4 అసోసియేటివ్‌ ప్రొఫెసర్‌

2.వైఎస్సార్ జిల్లా వెంకటాంపల్లిలో వైఎస్సార్ హార్టికల్చర్‌ యూనివర్సిటీ కింద అరటి పరిశోధన సంస్థకు 11 పోస్టులు(5 టీచింగ్‌, 6 నాన్ టీచింగ్ పోస్టులు)

3.సీఐడీ విభాగంలో 10 జూనియర్ అసిస్టెంట్‌లు, 10 స్టెనో పోస్టులు

4.ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 210 టీచింగ్, 89 నాన్ టీచింగ్ పోస్టులు

5.శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 201 టీచింగ్‌, 89 నాన్ టీచింగ్ పోస్టులు

6.స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్‌ కమిషన్‌లో 28 పోస్టులు. వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.