AP CM YS Jagan on Telangana Employes: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగుల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరబోతోంది. వారి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తెలంగాణ ప్రాంత ఉద్యోగులు కలిశారు. తమ కుటుంబాలన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయిని, తాము ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగం చేయటం ఇబ్బందిగా ఉందని సీఎం జగన్‌కు వారు వివరించారు. తమను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని ఉద్యోగులు ముఖ్యమంత్రి జగన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో వారిపట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు అనుగుణంగా క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేసిన ఉద్యోగులు రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కేటాయించారు. దీంతో వారి కుటంబాలు తెలంగాణలో, వారు మాత్రం ఏడేళ్లుగా ఏపీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశాన్ని సీఎం జగన్ ప్రస్తావించగా, సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ సర్కార్.. తెలంగాణ నుంచి ఏపీకి సంబంధిత ఫైల్‌ను పంపింది. ఈ విషయాన్ని ఉద్యోగులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఎం జగన్ వెంటనే స్పందించారు. ఉద్యోగుల బదిలీ ఫైల్‌ను క్లియర్ చేసి తెలంగాణ రాష్ట్రానికి పంపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అడిగిన వెంటనే సీఎం జగన్ మంచి మనసుతో అంగీకరించి, వెనువెంటనే ఆదేశాలు జారీ చేశారని తెలంగాణ ఉద్యోగులు హర్షం వ్యక‍్తం చేశారు.
దీంతో తక్షణమే ఏపీలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన దస్త్రాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. సొంత రాష్ట్రానికి వెళ్తున్న 711 మంది ఉద్యోగులకు సీఎం జగన్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తమను రిలీవ్ చేయడం పట్ల తెలంగాణ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెలగపూడిలోని సచివాలయం వద్ద బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ విడిపోయి దాదాపు ఏడేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ విభజన చట్టానికి సంబంధించి కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయాయి. వీటిలో ఉద్యోగుల విభజన ఒకటి. ఇప్పటికే పలువురు ఉద్యోగులు ఆయా రాష్ట్రాలకు బదిలీ కాగా, ఇంకా కొందరు మాత్రం పక్క రాష్ట్రంలోనే పని చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రాంతానికి ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త అందించారు.
Read Also….
Vijayasai Reddy send off wish : విధి నిర్వహణలో విఫలమైన నిమ్మగడ్డకు పదవీ విరమణ శుభాకాంక్షలంట.!
Teaching in Forest: కరోనా తెచ్చిన కొత్త పాఠశాల.. కారుడవుల్లో కాంతి రేఖ.. ఇంటి వద్దనే విద్యా బోధన