ఈ నెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 16వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయని సమాచారం. మార్చిలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టినందున ఈ సమావేశాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌‌ను...

ఈ నెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Updated on: Jun 07, 2020 | 8:35 AM

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 16వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయని సమాచారం. మార్చిలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టినందున ఈ సమావేశాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందనుంది. ఈ నెల 11న జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కాగా 16న జరిగే అసెంబ్లీ సమావేశంలో.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే 18న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ 14 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలను కుదించే అవకాశం కనిపిస్తోంది. సాధ్యమైనన్ని తక్కువ రోజుల్లో బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఈ నెల 31తో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ముగియనున్నది. ఇక అలాగే ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణ బిల్లుతో పాటు, మరికొన్ని బిల్లులను కూడా ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

Read More:

వామ్మో.. 70 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ..

Loading...
Unable to load recommendations.
Follow Us