అగ్రిగోల్డ్ కేసు: డైరెక్టర్ వరప్రసాద్‌ అరెస్ట్

అగ్రిగోల్డ్ కేసులో కొత్త కీలక పరిణామం చోటుచేసుకుంది. సంస్థలో డైరెక్టర్ గా వ్యవహరించిన అవ్వ హేమ సుందర వరప్రసాద్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.  బినామీ పేర్లతో 7.32 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు కొన్నట్లు గుర్తించిన సీఐడీ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లాలో పటమట, గుండాల, నూజివీడు, గన్నవరం, కంకిపాడు ప్రాంతాల్లో 7 రకాల స్థిరాస్తులను సీఐడీ గుర్తించింది. అగ్రిగోల్డ్ స్కాంలో వరప్రసాద్ ఏ6 నిందితుడిగా ఉన్నారు. సోమవారం సాయంత్రం 6 […]

అగ్రిగోల్డ్ కేసు: డైరెక్టర్ వరప్రసాద్‌ అరెస్ట్

Edited By:

Updated on: Jul 16, 2019 | 10:45 AM

అగ్రిగోల్డ్ కేసులో కొత్త కీలక పరిణామం చోటుచేసుకుంది. సంస్థలో డైరెక్టర్ గా వ్యవహరించిన అవ్వ హేమ సుందర వరప్రసాద్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.  బినామీ పేర్లతో 7.32 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు కొన్నట్లు గుర్తించిన సీఐడీ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లాలో పటమట, గుండాల, నూజివీడు, గన్నవరం, కంకిపాడు ప్రాంతాల్లో 7 రకాల స్థిరాస్తులను సీఐడీ గుర్తించింది.

అగ్రిగోల్డ్ స్కాంలో వరప్రసాద్ ఏ6 నిందితుడిగా ఉన్నారు. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అతని ఇంట్లో అధికారులు దాడులు చేశారు. పలు డాక్యుమెంట్లతో పాటు ఫేక్ ఐడీలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల మార్కెట్ విలువ 50కోట్ల వరకు ఉంటుందని అంచనా. వరప్రసాద్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మెట్రో పొలిటియన్ సెషన్స్ జడ్జ్ ఎదుట హాజరుపరచి.. జ్యూడీషియర్ రిమాండ్‌కు తరలించారు.