ఏపీలో ఈ నెల పింఛన్లు, జీతాల చెల్లింపులో జాప్యం!

ఆంధ్రప్రదే‌శ్‌ రాష్ట్రంలో లబ్ధిదారుల పింఛన్లు, ఉద్యోగుల జీతాల చెల్లింపులు ఈ నెల ఆలస్యంగా జరగనున్నాయి. జూలై 1,2 వ తేదీల్లో చెల్లించాల్సిన జీతభత్యాలు..

ఏపీలో ఈ నెల పింఛన్లు, జీతాల చెల్లింపులో జాప్యం!

Updated on: Jul 01, 2020 | 2:21 PM

ఆంధ్రప్రదే‌శ్‌ రాష్ట్రంలో లబ్ధిదారుల పింఛన్లు, ఉద్యోగుల జీతాల చెల్లింపులు ఈ నెల ఆలస్యంగా జరగనున్నాయి. జూలై 1,2 వ తేదీల్లో చెల్లించాల్సిన జీతభత్యాలు మూడో తేదీ తర్వాతే ఖాతాల్లో పడనున్నట్లు సమాచారం.  ఎందుకంటే, ..బడ్జెట్‌కి సంబంధించిన అప్రాప్రియేషన్‌ బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందలేదు. అందువల్ల నిధుల వినియోగానికి సంబంధించిన ఇబ్బంది ఏర్పడినట్లుగా తెలుస్తోంది.

వాస్తవానికి ద్రవ్యబిల్లు చట్ట సభల్లో ఆమోదం లేకున్నా..14 రోజుల తర్వాత పాసైనట్లుగా భావిస్తారు. గత నెల 17వ తేదీన ఏపీ శాసన మండలిలో ద్రవ్యబిల్లును ప్రవేశపెట్టారు. ఈ లెక్కన చూసుకుంటే..జూలై 1తో 14 రోజులు పూర్తి అవుతుంది కాబట్టి,..గవర్నర్ వద్దకు ఆమోదం కోసం ద్రవ్య బిల్లును పంపనుంది ప్రభుత్వం. అదే రోజున గవర్నర్ ఆమోద ముద్రపడితే..జూలై 3 నుంచి బడ్జెట్ ఆమల్లోకి వస్తుంది. దానిని ఖరారు చేస్తూ.. ఆర్థికశాఖ ఒక జీవో జారీ చేస్తుంది. అనంతరమే లబ్ధిదారులకు పింఛన్లు, వేతనాల చెల్లింపుల ప్రక్రియ మొదలుకానుంది.