Andhra Pradesh: నెట్ లేక చెట్టుకొకరు, పుట్టకొకరు.. ఆంక్షలతో అమలాపురంలో హైటెన్షన్

అమలాపురంలో(Amalapuram) చెలరేగిన ఘర్షణలతో కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. అవాస్తవాలు, వదంతులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, పరిస్థితులు చక్కబడేంతవరకు ఇంటర్నెట్ పై ఆంక్షలు ఉంటాయని...

Andhra Pradesh: నెట్ లేక చెట్టుకొకరు, పుట్టకొకరు.. ఆంక్షలతో అమలాపురంలో హైటెన్షన్
Ban On Internet

Updated on: Jun 01, 2022 | 10:43 AM

అమలాపురంలో(Amalapuram) చెలరేగిన ఘర్షణలతో కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. అవాస్తవాలు, వదంతులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, పరిస్థితులు చక్కబడేంతవరకు ఇంటర్నెట్ పై ఆంక్షలు ఉంటాయని తెలుస్తోంది. దీంతో విద్యార్థులు, వర్క్ ఫ్రమ్ హోం(Work From Home) చేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకింగ్ సేవలతో పాటు ఆన్లైన్ సేవలు, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సర్వీసులు నిలిచిపోయాయి. తొందరగా తమకు ఇంటర్నెట్(Internet) సేవలు తేవాలని కోరుతున్నారు. ఐదు రోజులుగా ఇంటర్నెట్‌ సేవలు ఆగిపోవడంతో నెట్‌వర్క్‌ కోసం జిల్లా సరిహద్దులు దాటి, ల్యాప్‌టాప్‌లతో వెళ్లి వర్క్‌ చేసుకుంటున్నారు. మరో వైపు కోనసీమ జిల్లాలో పోలీసుల భారీ బందోబస్తు కొనసాగుతోంది. అమలాపురం పట్టణం పూర్తిగా అష్టదిగ్భందంలోకి వెళ్లిపోయింది. పోలీస్ పికెట్లు, భారీ గస్తీ ఏర్పాటు చేశారు. వాలంటీర్లు కూడా జిల్లా సరిహద్దులకు వచ్చి పనిచేస్తున్నారు. ఇంటర్నెట్‌ను పునరుద్ధరిస్తే, పనులు సులువుగా అవుతాయని కోరుతున్నారు.

మరోవైపు.. కోనసీమకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును ఉంచాలని డిమాండ్ చేస్తూ దళిత గిరిజన బహుజన ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అంబేడ్కర్ పేరును వివాదాస్పదం చెయ్యొద్దు అని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అంబేడ్కర్ పేరుతో ఉన్న కోనసీమ జిల్లాను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us