TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. బ్రేక్ దర్శనాలపై టీటీడీ బోర్డు కీలక నిర్ణయం

రానున్న మూడు నెలల పాటు కొనసాగనున్న వేసవి సెలవులకు తిరుమలలో భారీ ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన నెలవారీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. బ్రేక్ దర్శనాలపై టీటీడీ బోర్డు కీలక నిర్ణయం
Ttd Darshan

Updated on: Apr 05, 2024 | 7:29 PM

రానున్న మూడు నెలలపాటు వేసవి సెలవులకు తిరుమలలో భారీ ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన నెలవారీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయాలని టీటీడీ బోర్డు తీర్మానించిందని, తద్వారా సామాన్య భక్తులకు ఎక్కువ దర్శన సమయం లభిస్తుందని తెలిపారు.

సామాన్య భక్తుల సౌకర్యార్థం సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం ఇస్తూ సిఫార్సు లేఖల ఆధారంగా వీఐపీ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది.  క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లు, బయటి లైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదం, మజ్జిగ, స్నాక్స్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇక మాడవీధుల్లో కూల్  పెయింటింగ్ తో పాటు త్రాగునీటి ప్రదేశాలు కల్పించనున్నారు. వేసవి రద్దీలో భక్తులకు సహాయం అందించడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ తో పాటు 2500 శ్రీవారి సేవకులను నియమించారు. శేషాచల అటవీ ప్రాంతాల్లో సమ్మర్ లో ఆకస్మిక అగ్నిప్రమాదాలను నివారించడానికి టీటీడీ అటవీ శాఖ, ప్రభుత్వ అగ్నిమాపక శాఖ సంయుక్తంగా రివ్యూ చేయడంతో పాటు  వేసవిలో నీటి ఎద్దడి దృష్ట్యా నీటిని వృథా చేయకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు టీడీపీ విజ్ఞప్తి చేసింది

కాగా తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. కనకభట్టర్, ఆగమ సలహాదారు శ్రీ సీతారామాచార్యులు పర్యవేక్షణలో ఉదయం 7.45 నుంచి 8.25 గంటల మధ్య అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమం ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటల నుంచి 8.30 గంటల మధ్య పెద్ద శేష వాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయి.