Asani Cyclone Effect: రైల్వే ప్రయాణికులకి అలర్ట్‌.. అసని తుఫాన్‌ కారణంగా పలు రైళ్లు రద్దు..!

|

May 11, 2022 | 5:45 AM

sani Cyclone Effect: పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్‌ ప్రభావం కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

Asani Cyclone Effect: రైల్వే ప్రయాణికులకి అలర్ట్‌.. అసని తుఫాన్‌ కారణంగా పలు రైళ్లు రద్దు..!
Follow us on

Asani Cyclone Effect: పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్‌ ప్రభావం కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో దక్షిణ మధ్య రైల్వే బుధవారం పలు రైళ్లను రద్దు చేసింది. దాదాపు 37 రైళ్లని రద్దు చేసింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు. అయితే రద్దు చేసిన కొన్ని రైళ్ల వివరాలని తెలుసుకుందాం.

విజయవాడ- మచిలీపట్నం, మచిలీపట్నం- విజయవాడ, విజయవాడ- నర్సాపూర్‌, నర్సాపూర్‌- నిడదవోలు, నిడదవోలు-నర్సాపూర్‌, నర్సాపూర్‌- విజయవాడ, విజయవాడ-నర్సాపూర్‌, నిడదవోలు-భీమవరం జంక్షన్‌, భీమవరం జంక్షన్‌-నిడదవోలు, మచిలీపట్నం-గుడివాడ, భీమవరం జంక్షన్‌- మచిలీపట్నం, గుడివాడ- మచిలీపట్నం, నర్సాపూర్‌-గుంటూర్‌, గుంటూర్‌-నర్సాపూర్‌, కాకినాడ పోర్ట్‌- విజయవాడ రైళ్లు ఉన్నాయి. నర్సాపూర్‌- నాగర్‌సోల్‌ రైలును రీషెడ్యూల్‌ చేశారు. నర్సాపూర్‌ నుంచి బుధవారం 11.05 గంటలకు బయలుదేరాల్సిన రైలు మధ్యాహ్నం 2.05 గంటలకు వెళ్లనుంది. రెండు రైళ్లను దారి మళ్లించారు. వీటిలో బిలాస్‌పూర్‌- తిరుపతి, కాకినాడ పోర్ట్‌-చెంగల్‌పట్టు రైళ్లు ఉన్నాయి.

ఇదిలా ఉంటే తుఫాన్‌ కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని తుఫాన్‌ వార్తలకి ఇక్కడ క్లిక్ చేయండి

AP News: చిత్తూరు జిల్లా ఆస్పత్రికి మాజీ మంత్రి నారాయణ.. వైద్య పరీక్షల నిర్వహణ.. మెజిస్ట్రేట్‌ ముందు హాజరు..

LSG vs GT: 80 పరుగులకే సర్దేసిన లక్నో.. 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన గుజరాత్

Viral Video: తెల్లపులి, పసుపు పులి మధ్య భీకర పోరు.. మామూలుగా లేదు ఫైట్‌..!