
పేదవాళ్లు కూడా ‘లక్షా’ధికారులే ఇప్పుడు. పసుపు తాడే కావొచ్చు గానీ.. సూత్రాలు బంగారపువి కాబట్టి ఆ లెక్కన ‘లక్షా’ధికారులే. ఏ ఇంటికి వెళ్లినా, ఏ వీధిలో చూసినా అంతా ‘లక్షా’ధికారుల్లాగే కనిపిస్తున్నారు దొంగలకి. పది గ్రాములు దోచేస్తే చాలు.. ఆ దొంగా లక్షాధికారే. పది ప్లాన్లు వేసి, పదేసి గ్రాముల చొప్పున దోచేసినా ఏడాదంతా బిందాస్. ఇదేదో దొంగలను ఎంకరేజ్ చేసినట్టుంది గానీ… గోల్డ్ గ్యాంగ్స్ ప్లాన్స్ ఇలానే ఉన్నాయ్. ఊరికనే చెప్పడం కాదు. గోల్డ్ రేట్ పెరిగినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో, అమెరికా టు బ్రిటన్‌లో గోల్డ్ క్రైమ్ డేటా చెప్తానిప్పుడు. మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంటాయా స్టాటిస్టిక్స్. ఫైనాన్షియల్‌గా కాస్త బెటర్ పొజిషన్‌లో ఉన్న వాళ్లు సైతం… ఓ స్పోర్ట్స్ బైక్ కొనుక్కొని, హెల్మెట్ పెట్టుకుని, మెడలో ఉన్న గోల్డ్ చైన్ లాక్కుని వెళ్తున్నారు. కారణం.. ఈజీ మనీకి అలవాటు పడడం. జల్సాలు చేయడానికైనా, గంజాయి-డ్రగ్స్ వంటిని కొనుక్కోవాలన్నా చాలా డబ్బు కావాలి. ఈరోజుల్లో పర్సులో డబ్బు పట్టుకెళ్తున్న వాళ్లే లేరు. సో, లచ్చిందేవే నడిచొస్తున్నట్టు కనిపించేది మెడలో చైన్లు వేసుకుని తిరుగుతున్న వాళ్లే. వారం క్రితం తార్నాకలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. బీరువాలో ఉంచిన 15 తులాల బంగారాన్ని దోచాడో దొంగ. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే.. ఆ దొంగతనం చేసింది ధీరజ్ అనే 30 ఏళ్ల సైకోథెరపి డాక్టర్ అని తేలింది. పెరుగుతున్న బంగారం...