Andhra: పిఠాపురంలో గుట్టుచప్పుడు యవ్వారం.. డబ్బాలు డబ్బాలుగా.. అమ్మబాబోయ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురం కల్తీ నెయ్యి కలకలం రేపుతోంది. కల్తీ నెయ్యి గౌడౌన్‌లు చాలానే ఉన్నాయని.. వాటిపై అధికారులు రైడ్ చేయాలని స్థానికులు కోరారు. ఆ వివరాలు ఏంటో మీరూ ఈ ఆర్టికల్‌లో చూసేయండి. ఓ సారి లుక్కేయండి మరి.

Andhra: పిఠాపురంలో గుట్టుచప్పుడు యవ్వారం.. డబ్బాలు డబ్బాలుగా.. అమ్మబాబోయ్
Adulterated Ghee

Edited By: Ravi Kiran

Updated on: Nov 07, 2025 | 1:02 PM

దక్షిణ కాశీగా పేరొందిన కాకినాడ జిల్లా పిఠాపురంలో జంతు కొవ్వుతో నెయ్యి తయారి కలకలం రేపింది. ఇక్కడ తయారీ అవుతున్న కల్తీ నెయ్యిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి జరుగుతున్నట్టు ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. పిఠాపురం మాధవ్ నగర్‌లోని గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంటిలో నెయ్యి తయారీ కర్మాగారాన్ని మణికంఠ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. దీనిపై పిఠాపురం విశ్వహిందూ పరిషత్తు అధ్యక్షుడు దువ్వా వెంకటేశ్వరరావు అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. దీంతో అధికారులు దాడులు నిర్వహించి 22డబ్బులతో సుమారు 330కేజీల కల్తీ నెయ్యి జంతు కొవ్వును అధికారులు పట్టుకున్నారు.

రెవెన్యూ పోలీస్ కుల సహకారంతో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో నెయ్యిను పశు వ్యర్ధాలను డంపింగ్ యార్డులో మున్సిపాలిటీ సిబ్బంది పూడ్చి పెట్టారు. గత సంవత్సరం ఇదే నెలలో పిఠాపురం కల్తీ ఆయిల్ తయారీ కర్మాగారాన్ని అధికారులు దాడులు చేసి మూయించారు. అయితే నియోజకవర్గంలో కల్తీ నెయ్యి స్థావరాలు పెరిగిపోతున్నాయని పట్టుకున్నది చిన్నది మాత్రమేనని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు దోవ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఇవన్నీ కూడా అధికారులకు తెలిసే జరుగుతున్నాయని ఇటువంటి వాటిని తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

అధికారులు గుర్తించిన జంతు కొవ్వు..

కల్తీ నెయ్యి స్థావరంపై అధికారులు దాడులు నిర్వహించగా జంతు కొవ్వు, నెయ్యి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నమూనాలను ఆహార నియంత్రణ విభాగం అధికారులకు పంపించారు. మిగిలిన జంతు కొవ్వును, నెయ్యిను పారిశుద్ధ్య కార్మికులతో భూమిలో పూడ్పిపెట్టారు. కల్తీ నెయ్యో కర్మగారం నిర్వహిస్తున్న మణికంఠపై మున్సిపల్ అధికారులు కేసు పెట్టినట్లు తెలియజేశారు.