Narasimha Murthy Raju: ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు సూసైడ్‌..! ఏం జరిగిందో..?

ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడలోని అయోధ్యనగర్ క్షత్రియభవన్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం (జులై 4) రాత్రి సూసైడ్‌ చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు..

Narasimha Murthy Raju: ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు సూసైడ్‌..! ఏం జరిగిందో..?
Aditya Pharmacy MD Narasimha Murthy Raju

Updated on: Jul 05, 2025 | 2:52 PM

విజయవాడ, జులై 5: తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్లు వ్యాపారాలు సాగిస్తున్న ప్రముఖ ఫార్మసీ కంపెనీ.. ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడలోని అయోధ్యనగర్ క్షత్రియభవన్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం (జులై 4) రాత్రి సూసైడ్‌ చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆయన సూసైడ్‌ లెటర్‌లో పేర్కొన్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లిన ఆయన ఉన్నట్లుండి ఆత్మహత్యకు పాల్పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

కాగా గతేడాది నరసింహమూర్తి రాజు బిజినెస్‌ పాట్నర్‌, అతడి స్నేహితుడి హత్య కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్ది రోజులకే ఆయన ఆత్మహత్యకు పాల్పడటం చర్చణీయాంశంగా మారింది. ఆదిత్య ఫార్మా కంపెనీకి పలు రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్న సంగతి తెలిసిందే. నరసింహమూర్తి రాజు మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి