ఏపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ప్రముఖ టీడీపీ నేత.. అమెరికాలో ట్రంప్, రాష్ట్రంలో జగన్..

|

Dec 05, 2020 | 9:48 PM

ఏపీ ప్రభుత్వ పరిపాలనపై తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజారావు అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు.

ఏపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ప్రముఖ టీడీపీ నేత.. అమెరికాలో ట్రంప్, రాష్ట్రంలో జగన్..
Atchannaidu
Follow us on

ఏపీ ప్రభుత్వ పరిపాలనపై తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజారావు అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాలో ట్రంప్, రాష్ట్రంలో జగన్ నియంతలుగా వ్యవహరిస్తున్నారిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించి మాట్లాడారు.

అసెంబ్లీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏకపక్ష తీర్మానాలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్దం అన్నారు. అంతేకాకుండా బిహార్‌లో అసెంబ్లీ, రాజస్థాన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు, హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు కరోనా సమయంలోనే జరిగాయని, మరి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించేందుకు అడ్డేంటని ప్రశ్నించారు? స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం జగన్ పిరికితనానికి నిదర్శనమన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని, ప్రతిపక్షాలను పట్టించుకోకుండా రాష్ట్రంలో నిరంకుశ పరిపాలనను కొనసాగిస్తున్నారని మండి పడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా తనకు ఇష్టం వచ్చినట్లు పాలన చేస్తూ, ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడుతున్నానని చెప్పడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు.