ఏబీ వెంకటేశ్వరరావుకు చేదు అనుభవం.. విజయవాడ పుర పోరులో ఎన్ని ఓట్లు వచ్చాయంటే..

విజయవాడ మేయర్ ఎన్నికల్లో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు నిరాశ ఎదురైంది. కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనకు 11,137 ఓట్లు వచ్చినట్లు సమాచారం.. మరోవైపు జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ భారీ మెజారిటీతో మేయర్‌గా విజయం సాధించారు.

ఏబీ వెంకటేశ్వరరావుకు చేదు అనుభవం.. విజయవాడ పుర పోరులో ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
Ab Venkateswara Rao Loses Deposit

Updated on: Nov 04, 2026 | 10:36 AM

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో హోరాహోరీ ప్రచారం నిర్వహించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఫలితాల్లో తీవ్ర నిరాశ ఎదురైంది. కాంగ్రెస్ సహా సీపీఐ, సీపీఎం (వామపక్షాల) ఉమ్మడి మద్దతుతో రేసులో నిలిచిన ఆయన, నగర పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆ ప్రచారం ఓట్లుగా మారడంలో పూర్తిగా విఫలమైంది. ఎన్నికల బరిలో కనీస గౌరవప్రదమైన ఓట్లను సాధించలేకపోయిన ఏబీవీ, ఆఖరికి డిపాజిట్‌ను కూడా కోల్పోయారు. అర్ధరాత్రి 1:30 గంటలకు వెలువడిన అధికారిక ఫలితాల ప్రకారం ఆయనకు కేవలం 12 వేలకు పైగా ఓట్లు మాత్రమే లభించాయి. గత 2019 ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేసిన సీపీఎం నాయకుడు బాబూరావు 29,333 ఓట్లు సాధించారు. ఆ గణాంకాలతో పోల్చి చూస్తే.. ఈసారి వామపక్షాల సాంప్రదాయ ఓటు బ్యాంక్ కూడా ఏబీ వెంకటేశ్వరరావుకు పూర్తిగా బదిలీ కాలేదని పలువురు పేర్కొంటున్నారు.

విజయవాడ మేయర్ ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించింది. భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థి వంగవీటి రాధ గెలుపొందారు.

కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకి మొత్తం 2,65,888 ఓట్లు రాగా..  1,30,872 మెజార్టీ లభించింది. వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి ఏబీవీకి 12,642 మాత్రమే వచ్చాయి..

విజయవాడ కార్పొరేషన్‌లో 86 డివిజన్‌లలో 53 చోట్ల TDP గెలిచింది. జనసేన 19 డివిజన్‌లను కైవసం చేసుసుకుంది. కేవలం 8 డివిజన్‌లకే YCP పరిమితమైంది. నాలుగు చోట్ల BJP, ఒక చోట CPM, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us