ధన త్రయోదశి రోజున యమ దీపం ఎందుకు దానం చేస్తారో తెలుసా?
samatha
4 November 2026
Pic credit - Pinterest
దీపావళి పండుగ ధన త్రయోదశి, దీనినే ధంతేరాస్ అని కూడా అంటారు. దీంతో ప్రారంభం అవుతుంది. హిందూ మంతంలో ధన త్రయోదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
దీపావళి
ఈరోజు లక్ష్మీదేవుడిని, ధన్వంతరి దేవుడు, కుబేరుడిని ప్రజలు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజించుకోవడం జరుగుతుంది.
లక్ష్మీ పూజా
అంతే కాకుండా ఈ రోజు సాయంత్రం పూజ తర్వాత వెలిగించే దీపం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీనినే యమ దీపం అని కూడా అంటారు.
యమ దీపం
ధన త్రయోదశి రోజు ఇంటి ప్రధాన ద్వారానికి దక్షిణం వైపున ఈ యమ దీపం వెలిగిస్తారు. దీనిని వెలిగిండం వలన కుటుంబ సభ్యుల అకాల మరణం నుంచి బయటపడతారంట.
ప్రధాన ద్వారం దక్షిణం
కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని, వారు అకాల మరణం నుంచి బయటపడాలి అని యమధర్మ రాజును పూజిస్తూ ఈ యమ దీపం వెలిగిస్తారు.
అకాల మరణ బాధలు
పిండితో చేసినది లేదా ఒక కొత్త ప్రమిద దీసుకొని అందులో నువ్వుల నూనె పోసి, దక్షిణ వైపు చూసేలా యమ దీపం వెలిగిస్తారు. అక్కడ నవధాన్యాలు, పువ్వుల కూడా వేసి పూజ చేస్తారు.
దీపం వెలిగించడం
ఇలా యమ దీపం వెలిగించి, దానం చేయడం వలన పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగడమే కాకుండా కుటుంబాన్ని కూడా వారు దీవిస్తారంట.
పూర్వీకుల ఆత్మకు శాంతి
మరీ ముఖ్యంగా అపమృత్యు వినాశనం కోసం యమధర్మ రాజుకు ఈ దీపం సమర్పిస్తున్నాను, అని కూడా మనసులో కోరుకొని దీపం వెలిగించాలంట.