పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరీకి ప్రయత్నించాడు ఒక దొంగ. కిటికీ ఊసాలు కట్ చేసి లోపలి వెళ్ళాడు. విలువైనవి దొరకకపోవటంతో పాటు లాకర్స్ ఓపెన్ కాకపోవటంతో వచ్చిన దారినే వెనుతిరిగాడు. బ్యాంకులో ఏమి పోకపోయినా మేనేజర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని చాలా వేగంగా పట్టేశారు.
గత నెల 25 వ తేదీన కాళ్ల మండలం సీసలిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరి యత్నం జరగగా తాజాగా పోలీసులు కేసులో నిందితుడైన పిప్పళ్ళ రాజేష్‌ను అరెస్ట్ చేశారు. బ్యాంక్ పని మీద వచ్చిన్నట్టు రెండు పేపర్లు తీసుకుని ఒక కిటికీ దగ్గర నిందితుడు కొంత సేపు గడిపాడు. అదే రోజు రాత్రి అదే కిటికీ ఊసలను ఎలక్ట్రికల్ కట్టర్‌తో కోసి బ్యాంక్ లోపలికి వెళ్ళాడు. లోపల డబ్బు ఉన్న లాకర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. అది ఓపెన్ కాకపోవడంతో వెనుదిరిగాడు. మరుసటి రోజు బ్యాంక్ మేనేజర్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సి సి ఫుటేజ్‌ను పరిశీలించారు. ముందు రోజు సిసి ఫుటేజ్‌లో కిటికీ వద్ద ఉన్న వ్యక్తిని గుర్తించారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి ముసుగు వేసుకుని ఉండటంతో అతడిని గుర్తించటం కష్టం అనుకున్నారు. కాని ముందు రోజు ఒక వ్యక్తి కిటికీ వద్ద నిలుచుని ఉండటం అతడి చెప్పులు, చోరికి వచ్చిన వ్యక్తి చెప్పులు ఒకేలా ఉండటాన్ని గమనించి ఇద్దరూ ఒక్కరనే విషయాన్ని నిర్ధారించుకున్నారు. ఇక రెక్కి కోసం వచ్చిన అతడి స్కూటీ ఆధారంగా నిందితుడు పాత నేరస్తుడు పిప్పళ్ళ రాజేష్ ఈ ఘటనకు పాల్పడినట్లు నిర్ధారించారు. రాజేష్ గతంలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. భీమవరం వైపు వెళ్తున్న రాజేష్‌ను పోలీసులు కాపు కాసి పట్టుకున్నారు. అతను వద్ద నుండి 20వేల నగదు, ఎలక్ట్రికల్ కట్టర్, హోండా యాక్టివా స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు పంపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..