మడకశిరలో వింత ఆచారం.. అమ్మవారి విగ్రహాల చుట్టూ గొర్రెల ప్రదక్షిణ..!

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలో వింత ఆచారం కొనసాగుతోంది. మనుషుల మాదిరి ఒకదాని వెంట మరొకటి గొర్రెలు అమ్మవారి విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మడకశిరలో వారం రోజులు పాటు జరిగే కనుమ మారెమ్మ జాతరలో.. వేలాదిమంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకుంటారు.

మడకశిరలో వింత ఆచారం.. అమ్మవారి విగ్రహాల చుట్టూ గొర్రెల ప్రదక్షిణ..!
Madakasira Strange Custom

Edited By: Balaraju Goud

Updated on: Apr 17, 2025 | 7:53 PM

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలో వింత ఆచారం కొనసాగుతోంది. మనుషుల మాదిరి ఒకదాని వెంట మరొకటి గొర్రెలు అమ్మవారి విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మడకశిరలో వారం రోజులు పాటు జరిగే కనుమ మారెమ్మ జాతరలో.. వేలాదిమంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకుంటారు. ఆఖరి రోజు గొర్రెల కాపరులు గ్రామ శివారులో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటుచేసి తాము పెంచుకున్న గొర్రెలను అమ్మవారి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయిస్తారు.

అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే గొర్రెల కాపరులు వదిలిన వందల గొర్రెలు ఎక్కడ క్రమం తప్పకుండా అమ్మవారి విగ్రహాల చుట్టూ తిరుగుతాయి. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు మడకశిర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాది మంది తరలి వస్తుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేయడమే కాకుండా.. ఇలా వందల గొర్రెలు అమ్మవారి విగ్రహం చుట్టూ గిరిప్రదక్షిణ చేయడం కాస్త వింతగాను, విచిత్రంగాను ఉంది.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..