విజయవాడ,జులై 31: సోషల్ మీడియా వచ్చాక ప్రతిఒక్కరు ఒక్కరోజు కూడా ఫోన్ వాడకుండా ఉండలేకపోతున్నారు. మరికొందరైతే గంటల తరబడి ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్ చూడటంలో మునిగిపోతున్నారు. అయితే ఈ మధ్య కొంతమంది ఆన్‌లైన్‌లో తమను పరిచయం చేసుకుని నమ్మించి డబ్బులు కాజేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వాస్తవానికి ఫేస్‌బుక్‌లో చాలామంది తమ స్నేహితులకు అలగే తెలియని వారికి కూడా ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తుంటారు. అలాగే తెలియని వారి నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను ఆక్సెప్ట్ చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఇలాంటి తప్పు చేసి అప్పులపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే విజయవాడలోని ఎవరో తెలియని ఓ వ్యక్తితో ఫెస్‌బుక్‌లో పరిచయ పెంచుకున్న ఓ యువకుడు అప్పులపాలై రోడ్డున పడ్డాడు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6.70 లక్షల రూపాయలు ఫేస్ బుక్ పరిచయంతో పోగొట్టుకున్నాడు ఆ యువకుడు. అతడి డిగ్రీ పూర్తై మూడేళ్లవుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాడు. అయినప్పటికీ డబ్బులు చాలక పార్ట్ టైం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. దీంతో అతనికి ఫేస్ బుక్ లో పరిచయం అయిన ఓ వ్యక్తి దారుణంగా మోసం చేసాడు. తాను నిర్మాణ సంస్థలో ఉద్యోగం చేస్తున్నానంటూ పరిచయం చేసుకుని ఆ సంస్థలో చాల రాష్ట్రాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయంటూ నమ్మబలికాడు. దాంతో తనకు కూడా ఉద్యోగం కావాలంటూ ఆ యువకుడు అతడ్ని అడిగాడు. ఇక అంతే ఇక్కడ నుండి మొదలు పెట్టి మొత్తం గుళ్ల చేసే వరకు వదలలేదు ఆ కేటుగాడు. జాయినింగ్ ఫీజ్ అంటూ 680 రూపాయలతో మొదలు పెట్టాడు. ల్యాప్ టాప్ ఇంటికి వస్తుందంటూ 50 వేలకు పెంచాడు. ఇలా ఏదో ఒక కారణం చెప్తూ ఏకంగా లక్షల్లో గుంజేసాడు. జాబ్ వస్తే పోయిన డబ్బులన్నీ వచ్చేస్తాయని అతన్ని నమ్మిన బెజవాడ యువకుడు అది ఇది అని లేకుండా బ్యాంక్ అకౌంట్స్ ,క్రెడిట్ కార్డ్స్ ,లోన్ యాప్స్ అన్ని వాడేసి డబ్బులు కడుతూనే ఉన్నాడు.
ఆలా కట్టి కట్టి అది కాస్త మొయ్యలేని భారానికి చేరుకుంది. కానీ మనోడికి మాత్రం జాబ్ రాలేదు. పైగా ఇంకో లక్ష కడితే కచ్చితంగా జాబ్ వచేస్తుందంటూ నమ్మబలుకుతున్నాడా ఫేస్ బుక్ ఫ్రెండ్. దీంతో అనుమానం వచ్చిన యువకుడు ఇంట్లో చెప్తే తల్లితండ్రులు తాట తీస్తారని ఆఖరికి పోలీసులను ఆశ్రయించాడు. కేస్ నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఫేస్‌బుక్ పరిచయాలను నమ్మొద్దని ఆన్నౌన్ రిక్వెస్ట్‌లు యాక్సప్ట్ చేసి మోసపోవద్దని సూచిస్తున్నారు.