Fire Accident: విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 30 ఇళ్లు దగ్ధం..

విజయనగరం జిల్లా మెంటాడ మండలం బక్కులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కూరకుల వీధిలో 30 ఇళ్లు దగ్ధమయ్యాయి.

Fire Accident: విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 30 ఇళ్లు దగ్ధం..
Fire Accident

Updated on: Nov 12, 2021 | 10:05 PM

విజయనగరం జిల్లా మెంటాడ మండలం బక్కువలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కూరకుల వీధిలో 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు పేలుతుండటంతో సమీప నివాసాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో గ్రామస్థులు భయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందికి  స్థానికులు సమాచారం ఇచ్చారు. కోట పొలినాయుడు ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వడంతో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

మంటలు అదుపులోకి వచ్చినట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి చెప్పారు. ఇళ్లు దగ్ధమైన బాధితులకు స్థానిక పాఠశాలలో వసతి కల్పించామని తెలిపారు.

Read Also.. Andhra Pradesh: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైసీపీ

Andhra Pradesh: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైసీపీ

AP Rains: వర్షాలు, వరదలతో పొంగిపొర్లుతున్న చెరువులు.. ప్రాణాలను లెక్కచేయకుండా చేపల కోసం జనం ఫీట్లు.. ఎక్కడంటే