ఆడపడుచులకు బంపర్ ఆఫర్.. ముగ్గుల పోటీ విజేతకు లక్షల విలువైన ఇంటి స్థలం..!

| Edited By: Balaraju Goud

Jan 14, 2025 | 8:57 AM

కర్నూలు నగరం సంక్రాంతి శోభతో కలకలలాడుతోంది. ఎటు చూసిన రంగవల్లులే. ముగ్గుల పోటీల విజేతలకు నిజంగా సంక్రాంతి పండగే. లక్షలకు లక్షలు ఆఫర్ చేస్తున్నారు నిర్వాహకులు. విషయం తెలుసుకుని ముగ్గులు వేసేందుకు వేలాదిగా మహిళలు తరలివచ్చారు. ఏ వీధిలో చూసిన ముగ్గుల పోటీలు రంగురంగుల ముగ్గులు దర్శనమిస్తున్నాయి.

ఆడపడుచులకు బంపర్ ఆఫర్.. ముగ్గుల పోటీ విజేతకు లక్షల విలువైన ఇంటి స్థలం..!
Kurnool Muggulu
Follow us on

ముగ్గుల పోటీల విజేతలకు నిజంగా సంక్రాంతి పండగే. లక్షలకు లక్షలు ఆఫర్ చేస్తున్నారు నిర్వాహకులు. విషయం తెలుసుకుని ముగ్గులు వేసేందుకు వేలాదిగా మహిళలు తరలివచ్చారు. దీంతో రంగుల మయంగా మారింది కర్నూలు నగరం.

రంగురంగుల ముగ్గులతో కర్నూలు నగరం కలర్ ఫుల్‌గా మారింది. ఏ వీధిలో చూసిన ముగ్గుల పోటీలు రంగురంగుల ముగ్గులు దర్శనమిస్తున్నాయి. నిర్వాహకులు ఏకంగా ఇంటి స్థలాలను బహుమతులుగా ఉచితంగా ఇస్తుండటంతో మహిళలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కర్నూలు అవుట్ డోర్ స్టేడియం ముగ్గులు వేస్తున్న మహిళలతో నిండిపోయింది. వేలాదిమంది మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు.

మంచి ముగ్గులు వేసినవారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైస్ విజేతలకు ఇంటి స్థలాలను బహుమతులుగా ప్రకటించారు నిర్వాహకులు. అంతేకాదు ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ఇంటి వంటకు ఉపయోగించే ప్రెషర్ కుక్కర్ ఉచితంగా ఇస్తుండటంతో ఇక మహిళలకు నిజంగా సంక్రాంతి పండగే. కర్నూలు నగరానికి చెందిన డి.వి.ఆర్ నెట్‌వర్క్ ఈ పోటీలను నిర్వహించింది. ఉదయాన్నే స్టేడియానికి రంగురంగులతో మహిళలు కలర్ ఫుల్‌గా చేరుకుని.. తమ ముగ్గులను కూడా అంతే స్థాయిలో వేసి శభాష్ అనిపించుకున్నారు.

అవుట్ డోర్ స్టేడియం నిండా రంగురంగుల ముగ్గులు కనువిందు చేశాయి. మొదటి ముగ్గు ఎవరిది అనేదానిపై పరిశీలిస్తున్నారు. విజేతలు ప్రకటన బహుమతుల ప్రధానం కోసం సినిమా తారలను కర్నూలు నగరానికి రప్పించి వారి చేతులు మీదుగా ఇప్పించేందుకు నిర్వాహకులు డివిఆర్ ప్రయత్నిస్తున్నారు. జనవరి 15న పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాంకు కూడా వేలాదిమంది మహిళలు తరలి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..