Andhra Pradesh: ఆ ఊరిని వణికిస్తున్న ‘గునపం’ బ్యాచ్‌.. అర్థరాత్రి మంత్రగాళ్లతో వచ్చి..

|

Feb 08, 2023 | 6:18 AM

గుప్త నిధుల గునపం బ్యాచ్‌.. ఆ ఊరి గుండెల్లో గునపాలు గుచ్చుతోంది. ఆ బ్యాచ్‌ గునపం చప్పుళ్లతో ఊరు వణికిపోతోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ట్రెజర్‌ హంట్‌ బ్యాచ్‌లు ఊరి జనానికి టెర్రర్‌

Andhra Pradesh: ఆ ఊరిని వణికిస్తున్న ‘గునపం’ బ్యాచ్‌.. అర్థరాత్రి మంత్రగాళ్లతో వచ్చి..
Robbery
Follow us on

గుప్త నిధుల గునపం బ్యాచ్‌.. ఆ ఊరి గుండెల్లో గునపాలు గుచ్చుతోంది. ఆ బ్యాచ్‌ గునపం చప్పుళ్లతో ఊరు వణికిపోతోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ట్రెజర్‌ హంట్‌ బ్యాచ్‌లు ఊరి జనానికి టెర్రర్‌ పుట్టిస్టున్నాయి. రాత్రి పూట హర్రర్‌ సినిమా చూపిస్తున్నాయి. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తవ్వకాలు జరిపితే కాసులు కనిపించడం.. బంగారు నగలు దొరకడం అనేది రియల్‌ లైఫ్‌లో అసాధ్యం. కానీ అత్యాశకు పోయే సోకాల్డ్‌ పీపుల్‌.. ఇప్పటికీ ఎక్కడో అక్కడ పలుగు పారకు పనిచెబుతూనే ఉన్నారు. ఇళ్లల్లో అడ్డదిడ్డంగా సొరంగాలు తవ్వుతూనే ఉన్నారు. తాజాగా ప్రకాశం జిల్లా మండ్లమూరు మండలం వేములబండలో అదే సీన్ రిపీట్ అయింది. వేములబండలో దుగ్గినేని కృష్ణమ్మ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఎవరూ ఉండకపోవడంతో నిరూపయోగంగా ఉంది. చుట్టుపక్కల వాళ్లు ఇక్కడో ఇల్లు ఉందనే విషయాన్నే మరచిపోయారు. కానీ ఈ మధ్య గుప్త నిధుల ముఠా కన్ను మాత్రం ఈ ఇంటిపై పడింది. కోట్ల రూపాయలు కుమ్మరించే నగా నట్రా ఉందని నమ్మింది. ఆఘమేఘాల మీద ఇంటి యజమానికి చెందిన బంధువులను సంప్రదించి.. నిధుల గుట్టు చిత్రాన్ని 70ఎంఎం రేంజ్‌లో కళ్లకుకట్టింది.

గుప్త నిధుల ముఠా సభ్యుల స్క్రీన్‌ ప్లేకి.. కృష్ణమ్మ బంధువులు ఫిదా అయ్యారు. గుడ్డిగా నమ్మి తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంత్రగాళ్లు రావడం.. పూజలు చేయడం ఆ తర్వాత తవ్వకాలు చేపట్టడం కూడా చకచకా జరిగిపోయాయి. అయితే ఓ ఫైన్ డే తవ్వకాల చప్పుళ్లతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఏంటా అని ఆరాతీస్తే.. తవ్వకాల సీన్‌ షాక్‌కి గురిచేసింది.

ఇవి కూడా చదవండి

మంత్రగాళ్ల జోలికెళితే తమకెక్కడ మూడుతుందోనని కొంతమంది మ్యాటర్‌ని బయటపెట్టలేదు. అయితే పూజల పేరుతో ఇంటి యజమాని బంధువుల దగ్గర భారీగా వసూలు చేసిందట గుప్తనిధుల గ్యాంగ్‌. దీంతో ఆనోటా ఈనోటా మ్యాటర్ ఖాకీల చెవిన పడటంతో ఇద్దరు మంత్రగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని వేర్వేరు కోణాల్లో ప్రశ్నించారు. గుప్తనిధుల పేరుతో తవ్వకాలపై లోకల్ నేతలు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అమాయకులను మభ్యపెట్టి అలజడి సృష్టించే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

తవ్వకాలు జరిపితే నిధులు దొరుకుతాయా? ఇంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా? పల్లెల్లో ఇలాంటి సీన్లు కామనే. చాలామంది మోసపోతూనే ఉన్నారు. అయినా మళ్లీ మళ్లీ మంత్రగాళ్ల బారిన పడుతున్నారు. ఇలాంటి ముఠాలు నమ్మించే ప్రయత్నం చేస్తే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని నమ్మొద్దని సజెస్ట్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..