Andhra Pradesh: కారుణ మరణానికి అనుమతి ఇప్పించండి అంటూ ఏపీకి చెందిన ఓ ఉద్యోగి కేంద్ర బీసీ కమిషన్ సభ్యుడిని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు విజ్ఞాపన లేఖను అందజేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం కు చెందిన సిఆర్ మోహన్ ఇదే ప్రాంతంలోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నారు. అయితే, బీసీ కులానికి చెందిన తనకు ప్రమోషన్ ఇవ్వడం లేదని తీవ్ర వేదనకు గురయ్యాడు. ప్రమోషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన ధర్మాసనం.. క్రితమే మోహన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.
ప్రమోషన్‌తో పాటు.. బకాయిలు చెల్లించాలని తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు చెప్పినా మోహన్‌కు న్యాయం జరుగలేదు. అతనికి రావాల్సిన జీతం బకాయిలను వర్సిటీ అధికారులు చెల్లించలేదు. వర్సిటీ అధికారుల తీరుతో మోహన్ తీవ్ర వేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే మహన్ బీసీ కమిషన్‌ను ఆశ్రయించాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నానని, కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించవలసిందిగా కేంద్ర బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి తల్లోజిని కలిసి అభ్యర్థించాడు. బీసీ కులానికి చెందిన వాడిననే తనకు ప్రమోషన్, జీతం ఇవ్వడం లేదని వాపోయాడు. మోహన్ ఆవేదనపై స్పందించిన బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి తల్లోజి.. చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also read: