శ్రీకాకుళం మందస మండలం కొత్తపల్లి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహేంద్రతనయ నదిలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా.. మృతులు ఒడిశా వాసులుగా గుర్తింపు. మృతుల్లో చంటి పాపతో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం. సింహాచలంలో దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డాడు డ్రైవర్. అతనికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు స్థానికులు.