Child Swallowed Mentho Plus: చిన్న పిల్లలను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడాలి. కొన్ని సమాయాల్లో వారిని పట్టించుకోకపోతే.. ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. తాజాగా.. తల్లిదండ్రుల అప్రమత్తతో.. ప్రభుత్వ వైద్యలు చిన్నారి ప్రాణాన్ని కాపాడారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం (Anantapuram District) జిల్లాలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా కదిరి (kadiri) పట్టణంలో మెంతో ప్లస్ డబ్బా మింగిన తొమ్మిది నెలల చిన్నారిని ప్రభుత్వ వైద్యశాల వైద్యులు ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. కదిరి పట్టణంలోని వలిసాబ్ రోడ్ సహామీరియా వీధిలో ఇంటిలో ఆడుకుంటున్న చిన్నారి (Child) చేతికి జండూ బామ్ (మెంతో ప్లస్) డబ్బా దొరింది. దీంతో చిన్నారి తినే వస్తువుగా భావించి నోట్లో వేసుకుంది. అది కాస్త గొంతులో చిక్కుకోవడంతో చిన్నారి గుక్కపట్టి ఏడుస్తోంది. ఇది గమనించిన తల్లితండ్రులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారిని కదిరి ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. వైద్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. దాదాపు గంటసేపు శ్రమించి చిన్నారి గొంతులో నుంచి మెంతోప్లస్ డబ్బాను బయటకు తీసి చిన్నారి ప్రాణాలను కాపాడారు. తమ బిడ్డ ప్రాణాలతో బయట పడడంతో ఊపిరి పీల్చుకున్న తల్లితండ్రులు వైదులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనపై వైద్యులు మాట్లాడుతూ.. చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. వారిని నిరంతరం పర్యవేక్షించకపోతే.. ఇలాంటి సంఘటనలే జరుగుతాయని పేర్కొన్నారు.
Also Read: