చిత్తూరు జిల్లాలో 7 ఏళ్ల చిన్నారి మృతి రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. పుంగనూరు రాజకీయాన్ని మరోసారి వేడెక్కించింది. గత నెల 29న ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి వచ్చిన ఆస్తీయా ఆ తరువాత కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో డెడ్ బాడీ లభించడంతో సంచలనంగా మారింది. ఆస్తీయాది హత్యేనని దోషులని శిక్షంచాలి, బాలిక మృతి టీడీపీ ప్రభుత్వ వైఫల్యమేనని వైసీపీ ఆరోపిస్తుంది.
పుంగనూరులో జరిగిన మైనర్ బాలిక ఆస్తీయా హత్య కేసు వివాదాస్పదంగా మారింది.
ఒకవైపు వైసీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంతో పాటు మాజీ సీఎం జగన్ పరామర్శకు సిద్ధమైతే టీడీపీ నుంచి రాష్ట్ర మంత్రులు ఆస్తియా కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఇలా టీడీపీ వైసీపీ పరామర్శలతో మరోసారి పుంగనూరు రాజకీయం వేడెక్కింది.
గత నెల 29న మిస్ అయిన బాలిక అస్థియా ట్యూషన్‌కి వెళ్లి రాత్రి తిరిగి ఇంటికి వచ్చి ఆ తర్వాత కనిపించకుండా
పోయింది. ఈ మేరకు అదే రోజు పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు కూడా నమోదు అయ్యింది. ఆస్తియా మిస్సింగ్ కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ ఆచూకీ కనుగొనేందుకు 11 టీమ్స్ ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో
అక్టోబర్ 2న ఆస్తియా డెడ్ బాడీని గుర్తించారు.
ఈ మేరకు ఆస్తియా హత్యకు గురైందని కేసును ఆల్టర్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్తియా హత్య
పోలీసుల వైఫల్యమంటున్న వైసీపీ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతోంది. మరోవైపు ఆస్తియా మృతిపై విచారం వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్న చిత్తూరు జిల్లా ఎస్పీ నిందితులను అరెస్టు చేసి కేసును ఛేదిస్తామంటున్నారు