AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: అడవిలో వెళ్తూ దారి తప్పిన మహిళ.. ముప్పై గంటలైనా జాడలేదు.. డ్రోన్లు ఎగరవేసి చూడగా

రెండు రోజుల క్రితం ఉదయాన్నే బయలుదేరి పోలేపల్లి నుండి రాయవరం చేరుకొంది. అక్కడ నుండి బస్సులో గండిగనుమల వచ్చింది. ఆ తర్వాత అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ మేకలదిన్నె తండాకు వెళ్లాలని అనుకుంది. తెలిసిన మార్గం కావడంతో అడవిలో బయలుదేరింది. అయితే సాయంత్రం అయినా..

Andhra: అడవిలో వెళ్తూ దారి తప్పిన మహిళ.. ముప్పై గంటలైనా జాడలేదు.. డ్రోన్లు ఎగరవేసి చూడగా
Representative Image
T Nagaraju
| Edited By: |

Updated on: Oct 24, 2025 | 1:06 PM

Share

పల్నాడు జిల్లా దుర్గి మండలం పోలేపల్లిలో గత కొన్నేళ్లుగా బోడిబాయి నివసిస్తోంది. అయితే ఆమె స్వగ్రామం బొల్లాపల్లి మండలంలోని మేకల దిన్నె తండా. అరవై ఏళ్ల వయస్సున్నా గత పదేళ్లుగా పోలేపల్లిలో ఉంటుంది. అయితే మేకల దిన్నె తండా ఆమె బంధువులు చనిపోయారన్న వార్త తెలుసుకొని పోలేపల్లి నుండి తమ స్వగ్రామానికి బయలు దేరింది. అయితే ఆ గ్రామానికి నేరుగా బస్సు లేదు. దీంతో కొంత దూరం నల్లమల అడవిలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఎన్నోసార్లు ఆమె ఆ అడవిలో ప్రయాణం చేసిన అనుభవం ఉంది.

ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఉదయాన్నే బయలుదేరి పోలేపల్లి నుండి రాయవరం చేరుకొంది. అక్కడ నుండి బస్సులో గండిగనుమల వచ్చింది. ఆ తర్వాత అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ మేకలదిన్నె తండాకు వెళ్లాలని అనుకుంది. తెలిసిన మార్గం కావడంతో అడవిలో బయలుదేరింది. అయితే సాయంత్రం అయినా ఆమె మేకలదిన్నె తండాకు చేరుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన బంధువులు అడవిలో చాలా సేపు వెతికారు. అయినా లాభం లేకపోయింది. దీంతో 100 నంబర్‌కు ఫోన్ చేసి బోడిబాయి అదృశ్యం అయినట్లు ఫిర్యాదు చేశారు. వెంటనే బండ్లమోటు ఎస్సై సయ్యద్ సమీర్ బాషా రంగంలోకి దిగారు. నిన్న ఉదయాన్నే అటవీ మార్గం పట్టారు. మొదట పశువుల కాపర్లతో మాట్లాడారు. అయితే నిన్న బోడిబాయిను చూసినట్లు పశువుల కాపర్లు చెప్పారు. ఆమె వద్ద ఫోన్ లేకపోవడంతో సిగ్నల్స్ ఆధారంగా ఆమె గుర్తించడం కష్టమైపోయింది. దీంతో మరోసారి పోలీస్ సిబ్బంది అడవిని జల్లెడ పట్టారు. అదే సమయంలో డ్రోన్లను ఉపయోగించారు. అయితే అప్పటికే బోడి బాయి తప్పిపోయి ముప్పై గంటలు గడిచిపోయింది. రాత్రంతా ఒంటరిగానే గడిపింది. దీంతో ఆమె బ్రతికుంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఎస్సై సమీర్ భాషా గాలింపు ముమ్మరం చేశారు. పశువుల కాపర్లు ఇచ్చిన సమాచారాన్ని మరింతగా విశ్లేషించి చివరికి ఆమె కొండపై ఉన్నట్లు తేల్చారు. అక్కడ డ్రోన్స్ ఎగరవేశారు. ఎట్టకేలకు చెట్టు కింద బోడి బాయి కూర్చొని ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ఆమె వద్దకు చేరుకొని ఆమెన మేకలదిన్నె తండాకు తీసుకొచ్చారు. బోడి బాయి సురక్షితంగా రావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సై సమీర్ భాషాతో పాటు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

Follow Us
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!
పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా?వైరల్ వీడియో వెనుక నిజం
పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా?వైరల్ వీడియో వెనుక నిజం
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
ఇంటి బెడ్‌రూమ్‌లో పడిన ఉల్క.. భూమిపై జీవం పుట్టుకపై సంచలన నిజాలు!
ఇంటి బెడ్‌రూమ్‌లో పడిన ఉల్క.. భూమిపై జీవం పుట్టుకపై సంచలన నిజాలు!
గూగుల్ పిక్సెల్ 11 వస్తోంది.. విడుదల తేదీ ఖరారు.. ఫీచర్స్‌ లీక్..
గూగుల్ పిక్సెల్ 11 వస్తోంది.. విడుదల తేదీ ఖరారు.. ఫీచర్స్‌ లీక్..
నొప్పి తెలియదు.. కానీ ఇవి కిడ్నీ క్యాన్సర్ లక్షణాలని మీకు తెలుసా?
నొప్పి తెలియదు.. కానీ ఇవి కిడ్నీ క్యాన్సర్ లక్షణాలని మీకు తెలుసా?
కూతురా? అని ఎగతాళి చేశారు.. భార్యతో ఏజ్ గ్యాప్ పై సాయాజీ షిండే
కూతురా? అని ఎగతాళి చేశారు.. భార్యతో ఏజ్ గ్యాప్ పై సాయాజీ షిండే
ఈ ఆకుల్లో ఏ మహత్యముందో.. ఆ రోగాలన్నీ మటాష్..
ఈ ఆకుల్లో ఏ మహత్యముందో.. ఆ రోగాలన్నీ మటాష్..