అదే పనిగా అరుస్తున్న కోళ్లు.. ఏంటా అని చూడగా.. వామ్మో 5 అడుగులు.. గుండె ఆగేంతపనైంది..

మార్కాపురం జిల్లా కంభం మండలం నల్లకాలువ గ్రామంలో ఓ కోళ్ల ఫారంలో 5 అడుగుల నాగుపాము కలకలం రేపింది. కోళ్లకు దాణా వేయడానికి వెళ్లిన యజమానికి కోళ్లు అసాధారణంగా అరుస్తుండటంతో అనుమానం వచ్చి పరిశీలించగా, ఓ మూలన బుసలు కొడుతూ నాగుపాము కనిపించింది. భయంతో వెంటనే గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

అదే పనిగా అరుస్తున్న కోళ్లు.. ఏంటా అని చూడగా.. వామ్మో 5 అడుగులు.. గుండె ఆగేంతపనైంది..
Cobra Snake in poultry farm

Edited By:

Updated on: May 17, 2026 | 6:45 PM

కోడి గుడ్లను తినమరిగిన ఓ నాగుపాము ఓ కోళ్ళఫారంలో తిష్టవేసింది. ఆకలేసినప్పుడల్లా గుడ్లను మింగేస్తోంది. ఈ విషయం తెలియని కోళ్ళ ఫారం యజమాని ఎప్పటిలాగే కోళ్ళఫారంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నాడు. ఈరోజు కోళ్ళకు దాణా వేసే సమయంలో.. కోళ్ళు పెద్ద పెద్దగా అరుస్తుండటంతో అనుమానం వచ్చిన యజమాని ఫారంలోని ప్రతి ప్రాంతాన్ని గాలించాడు. దీంతో ఓ మూలననక్కి బుసలు కొడుతున్న 5 అడుగుల నాగుపాము కనిపించింది. నాగుపాములను చూడగానే హడలిపోయిన కోళ్ళఫారం యజమాని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు.

మార్కాపురం జిల్లా కంభం మండలం నల్లకాలువ గ్రామంలో నాగుపాము కలకలం రేపింది. 5 అడుగులకు పైగా పొడవున్న నాగుపాము గ్రామంలోని ఓ కోళ్ల ఫారంలో కనిపించింది. దీంతో ఆందోళన చెందిన ఫారం యజమాని గ్రామస్థులకు విషయం తెలియచేయడంతో, గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది నాగుపాముని చాకచక్యంగా బంధించారు.

వీడియో చూడండి..

అనంతరం సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కోళ్లు ఎక్కువగా శబ్దం చేస్తున్న విషయాన్ని గమనించిన కోళ్ళఫారం ఏంటా అని చూడగా పాము ఉన్న విషయాన్ని గుర్తించారు. విషపూరితమైన పామును అటవీ శాఖ అధికారులు పట్టుకోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us