G20 Working Group Meet: విశాఖ వేదికగా జీ-20 సన్నాహక సదస్సు.. 40 దేశాలకు ఆతిథ్యం.. భారీగా ఏర్పాట్లు

|

Jan 08, 2023 | 7:12 AM

జీ -20 సన్నాహక సదస్సుకు విశాఖ వేదిక కాబోతోంది. త్వరలోనే సాగర తీరంలో వేడుకలు జరగబోతున్నాయి. అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.

G20 Working Group Meet: విశాఖ వేదికగా జీ-20 సన్నాహక సదస్సు.. 40 దేశాలకు ఆతిథ్యం.. భారీగా ఏర్పాట్లు
G20 Summit
Follow us on

జీ -20 సన్నాహక సదస్సుకు విశాఖ వేదిక కాబోతోంది. త్వరలోనే సాగర తీరంలో వేడుకలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకునేలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జీ-20 అధ్యక్ష బాధ్యతలు బాధ్యతలు చేపట్టిన నాటినుంచి భారత్.. పెద్ద ఎత్తున సన్నాహక సదస్సులతోపాటు, పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా.. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించబోతోంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక జీ-20 సన్నాహక సదస్సుకు విశాఖపట్నం వేదిక కాబోతోంది. మార్చి 28, 29 తేదీల్లో విశాఖలో సమావేశాలు జరగనున్నాయి. రెండ్రోజుల పాటు జరిగే ఈ జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. 300 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు.

భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సుకు జీ-20 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, రాయబారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీఎం జగన్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. సదస్సు నిర్వహణకు విశాఖలో రెండు స్టార్‌ హోటళ్లను గుర్తించారు. అతిథుల కోసం నగరంలోని వివిధ స్టార్‌ హోటళ్లలో 300 గదులను బుక్‌ చేస్తున్నారు. నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటైంది. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు.

ఈ సమావేశాలతో విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రాచుర్యం దక్కనుంది. భారతదేశం అధికారికంగా డిసెంబర్ 1, 2022న G20 అధ్యక్ష పదవిని చేపట్టింది. జీ20 సదస్సు కోసం 56 నగరాల్లో 200 సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. డిజిటల్ పరివర్తన, హరిత అభివృద్ధి, మహిళా సాధికారత, యువత, రైతులు లాంటి అంశాలతో సదస్సులు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..