AP Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వివిధ పనుల నిమిత్తం వెళ్తున్న వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రెండు రోడ్డు ప్రమాదాల తల్లీ కొడుకులతోపాటు మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ కుటుంబంలో విషాదంగా మారింది. నంద్యాల బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి చెందారు. నంద్యాల నుంచి కౌలూరుకు బైక్‌పై వెళ్తుండగా, టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు సువర్ణ, అనిల్‌గా గుర్తించారు.
అలాగే గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఐదులాంతర్ల సెంటర్‌లో కూడా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు అసోం వాసి ముస్తక్ అలీగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు చాలా కారణాలున్నాయి. వాహనాలను అజాగ్రత్తగా నడపడం, మద్యం తాగి నడపం, అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.